పోరాట ఘట్టాలు మినహా ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ పూర్తి

KGF Chapter 2 Completes Majority Of Shooting Work Except A Few Portions Of Fight Sequences

పాన్ ఇండియా మూవీగా రిలీజైన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’.. నేషనల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన సెకండ్ పార్ట్ ‘కేజీఎఫ్: చాప్టర్ 2’.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తయిందని తెలిసింది. అంతేకాదు.. కీలక పోరాట ఘట్టాల చిత్రీకరణ మాత్రమే బాకీ ఉందని.. 21 రోజులపాటు ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని టాక్. కాగా, లాక్ డౌన్ అనంతరం చిత్రీక‌ర‌ణ పునఃప్రారంభం కానుంది. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. విజయదశమి కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

మరి.. మొదటి భాగంలాగే రెండో భాగం కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seven =