ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 3
వెంకటేష్ హిందీ చిత్రం ‘తక్‌దీర్‌వాలా’కు 25 ఏళ్ళు
'జీవితం తలకిందులైపోయింది' అందుకే ఇలా..!
ఫైనల్లీ బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టిన తాప్సీ..!
పెట్ డాగ్స్ తో ప్రిన్స్..అదిరిపోయిన యంగ్ లుక్..!
వరుణ్ తేజ్ ఆసక్తికర ట్వీట్
బాలీవుడ్ లోకి అనసూయ..!
'దిల్ రాజు' పెళ్లి ఫొటోలు విడుదల..!

అక్కినేని నాగేశ్వరరావు ‘సూత్రధారులు’కి 31 ఏళ్ళు
'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌గా ‘పుష్ప’
హీరో రామ్ కోలీవుడ్ ఎంట్రీ
బాలకృష్ణ చిత్రంలో 'స్వయంవరం' హీరో?
ఎన్టీఆర్ కోసం రోహిత్ స్పెషల్ గిఫ్ట్..!
ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు. ఒక పక్క అభిమానులు తమ హీరో బర్త్ డే సందర్భంగా ఏ సినిమా ఏ అప్ డేట్ వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ నుండి పెద్ద సర్ప్రైజ్ ఏ ఉంటుందని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమానుండి ఏదో ఒక అప్డేట్ వస్తుందని.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నట్టు కూడా వార్తలు వస్తుండటంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించిన కూడా ప్రకటన రావొచ్చని అనుకుంటున్నారు.
బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘భద్ర’కి 15 ఏళ్ళు
మాస్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. అలాంటి బోయపాటి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘భద్ర’. టైటిల్ రోల్‌లో మాస్ మహారాజా రవితేజ నటించగా.. అతనికి జోడిగా మీరా జాస్మిన్ దర్శనమిచ్చింది. దీపక్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, పద్మనాభం, సునీల్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్, ఈశ్వరీరావు, సుబ్బరాజు, సుధ, సురేఖా వాణి, ఝాన్సీ, రేవతి, జీవా ముఖ్య పాత్రలు పోషించారు.
వెంకటేష్ హిందీ చిత్రం ‘తక్‌దీర్‌వాలా’కు 25 ఏళ్ళు
తెలుగునాట అగ్ర కథానాయకుడిగా తనదైన బాణీ పలికించిన ‘విక్టరీ’ వెంకటేష్.. హిందీనాట కూడా సందడి చేశారు. తన కెరీర్ మొత్తమ్మీద రెండే రెండు హిందీ చిత్రాల్లో వెంకీ నటించారు. అందులో ఒకటి ‘అనారీ’కాగా.. రెండోది ‘తక్‌దీర్‌వాలా’. ఈ రెండు కూడా రీమేక్ సినిమాలు కావడం విశేషం. తెలుగునాట ఘనవిజయం సాధించిన ‘చంటి’కి రీమేక్ గా ‘అనారి’ రూపొందితే.. మరో సెన్సేషనల్ మూవీ ‘యమలీల’ ఆధారంగా ‘తక్‌దీర్‌వాలా’ తెరకెక్కింది.
'క్రాక్' అప్ డేట్ త్వరలోనే - కష్టపడి పనిచేస్తున్నాం..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. మరో 10రోజుల షూట్ మాత్రమే పెండింగ్ ఉందని ఇటీవలే తెలియచేసాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. కరోనా వల్ల ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.
'జీవితం తలకిందులైపోయింది' అందుకే ఇలా..!
మొత్తానికి కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించేసింది. దెబ్బకు అందరూ ఇంటి నుండి బయటకు రావడానికి భయపడేలా చేసింది. కనీసం ఒకరినొకరు పలకరించుకునే ఉరుకుల పరుగుల జీవితం.. కుటుంబ సభ్యులతో కూడా సరిగా మాట్లాడలేనంత బిజీ..ఈ కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమిత మయ్యారు. అందరికీ తమ కుటుంబాలతో కాస్త టైం స్పెండ్ చేసే అవకాశం దక్కింది. ముఖ్యంగా సెలెబ్రిటీస్ కు ఇది బాగా కలిసొచ్చింది. వాళ్ళది మరీ బిజీ లైఫ్ కదా.
ఫైనల్లీ బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టిన తాప్సీ..!
నటీనటులు తమ ప్రేమ గురించి మీడియా కంట పడకుండా.. వార్తల్లో రాకుండా ఉండటానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ పబ్లిక్ పర్సనాలిటీస్ కాబట్టి ఎంత దాచిన ఏదో ఒకరకంగా వార్తలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ వార్తలు వచ్చినా ఎక్కడా నోరు మాత్రం విప్పకుండా తమ పని తాము చేసుకుంటారు. కొంతమంది మాత్రం ఓపెన్ గానే రిలేషన్ లో ఉన్నామని చెప్తారనుకోండి. కాకపోతే ఎక్కువ మంది సెలబ్రిటీస్ మాత్రం సీక్రెట్ నే మెయిన్ టైన్ చేస్తుంటారు.
పెట్ డాగ్స్ తో ప్రిన్స్..అదిరిపోయిన యంగ్ లుక్..!
టాలీవుడ్ ప్రిన్స్, రాజకుమారుడు అంటే వెంటనే గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ అందం పెరుగుతుంది కానీ ఏ మాత్రం తగ్గట్లేదు. కాలేజ్ స్టూడెంట్ గెటప్ కూడా ఆయన ఇంకా సెట్ అవుతాడని మహర్షి సినిమాలో చేసి చూపించారు. ఇక ఇప్పుడు మహేష్ లుక్ ను చూసిన వారెవరైనా టాలీవుడ్ హీరోనా.. హాలీవుడ్ హీరోనా అన్న డౌట్ రాకుండా మారదు.
వరుణ్ తేజ్ ఆసక్తికర ట్వీట్
"ముకుంద " మూవీ తో వరుణ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. వరుణ్ హీరోగా నటించిన వార్ ఫిల్మ్ "కంచె " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "ఫిదా ", "తొలిప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్" వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #VT 10 మూవీ లో నటిస్తున్నారు.
"RED " మూవీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ రూపొందింది. నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, నాజర్, పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సూపర్ హిట్ తమిళ మూవీ "తడమ్" మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.
"ఇట్స్ టైమ్ టు పార్టీ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ హిట్ "జులాయి" మూవీ లో సపోర్టింగ్ రోల్ లో నటించి శ్రీముఖి సినీ కెరీర్ ప్రారంభించారు. "ప్రేమ ఇష్క్ కాదల్", "ధనలక్ష్మి తలుపు తడితే " వంటి మూవీస్ లో హీరోయిన్ గా నటించారు. "ఆంధ్రా పోరి" , "నేను శైలజ", "జంటిల్ మేన్", "మనలో ఒక్కడు", "సావిత్రి", "బాబు బాగా బిజీ" మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ లో శ్రీముఖి నటించారు.
బాలీవుడ్ లోకి అనసూయ..!
బుల్లితెరపై టాప్ యాంకర్ లు ఎవరంటే ఆ లిస్ట్ లో యాంకర్ అనసూయ పేరు ఖచ్చితంగా ఉంటది. విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్స్ లో అనసూయ ఒకరు. ఇక బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా అనసూయకు లక్ బాగానే కలిసొచ్చింది. క్షణం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ.. ఆతర్వాత వచ్చిన రంగస్థలంలోని రంగమత్త పాత్ర మాత్రం సినీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. రంగమ్మత్త క్యారెక్టర్ తో అనసూయ బదులు రంగమ్మత్త అని పిలుచుకునేంత బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అనసూయకు అవకాశాలు దక్కుతున్నాయి. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, ఆమె బుల్లితెరను వదిలేయకుండా కెరియర్ ను చక్కగా…
'దిల్ రాజు' పెళ్లి ఫొటోలు విడుదల..!
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం తన రెండో పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన దిల్ రాజు.. లాక్ డౌన్ నేపథ్యంలో నిజామాబాద్ లోని తన స్వగ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిరాడంబరంగా కేవలం తన కుటుంబ సభ్యులు.. కొద్దిపాటి బంధువుల సమక్షంలో ఈ పెళ్లి చేసుకున్నారు. తమ కుటుంబంతో పరిచయమున్న యువతినే దిల్ రాజు వివాహమాడినట్టు తెలుస్తుంది. ఆమె ఎయిర్ హోస్టెస్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఇక దిల్ రాజు పెళ్లి ఫోటోలు బయటకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
'నా ఫ్యూచర్ పిల్లల తల్లి' వైరల్ గా మారిన విఘ్నేష్ శివన్ పోస్ట్
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార సినిమా కెరీర్ కు మాత్రం ఏ ఢోకా లేదు. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది. తనకంటే లేట్ గా వచ్చిన హీరోయిన్స్ ఏ ఇప్పుడు వెనకపడినా నయన్ మాత్రం ఇంకా అదే హవా కొనసాగిస్తుంది. ఇక సినీ జీవితం పక్కన పెడితే.. వ్యక్తిత్వ జీవితం మాత్రం ఎప్పుడు వివాదాలతోనే ఉంటుంది. ఇప్పటికే రెండు మూడు బ్రేకప్ లు అయిన నయనతార గత కొన్నేళ్లుగా విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. తమ రిలేషన్ గురించి ఎక్కడా ఇంతవరకూ ఓపెన్ అయింది లేదు కానీ.. సోషల్ మీడియాలో తాము పలు సందర్భాల్లో కలిసి ఉన్న ఫొటో లు షేర్ చేస్తూ హింట్ ఇస్తూనే ఉంటారు.
"V" లో సుధీర్ బాబు స్టన్నింగ్ లుక్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ రూపొందింది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు కాగా జగపతి బాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సాంగ్స్ అందించగా, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
ఫస్ట్ 'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌గా ‘పుష్ప’..!
సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే ఆ సినిమా కాస్టింగ్ లో విదేశీ నటీనటులు, టెక్నిషియన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ ఓ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు కానీ.. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీయనున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? ఆ సినిమా ఏదో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘పుష్ప’.

అక్కినేని నాగేశ్వరరావు ‘సూత్రధారులు’కి 31 ఏళ్ళు
తెలుగు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిన పలు ఉత్తమ కథా చిత్రాల్లో నటించారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. వాటిలో ‘సూత్రధారులు’ ఒకటి. “కళాతపస్వి” కె.విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏయన్నార్ నటించిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కె.విశ్వనాథ్.. ఏయన్నార్ కథానాయకుడిగా నటించిన ‘ఆత్మగౌరవం’(1966) చిత్రంతోనే దర్శకుడిగా తొలి అడుగులు వేశారు. ఆ సినిమా అనంతరం దాదాపు రెండున్నర దశాబ్దాల భారీ విరామం తీసుకున్న ఈ ద్వయం.. ‘సూత్రధారులు’ చిత్రం కోసమే మరోసారి జట్టుకట్టడం విశేషం. ఇందులో ఏయన్నార్, సుజాత, మురళీమోహన్ ప్రధాన పాత్రధారులు కాగా.. భానుచందర్, రమ్యకృష్ణ నాయకానాయికలుగా…
'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌గా ‘పుష్ప’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర చందనం అక్రమ రావాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. లాక్ డౌన్ అనంతరం మలి షెడ్యూల్‌కి సన్నద్ధమవుతోంది.
హీరో రామ్ కోలీవుడ్ ఎంట్రీ
సూపర్ హిట్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి రామ్ పోతినేని తన యాక్టింగ్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రెడీ","కందిరీగ", పండగ చేస్కో, "నేను శైలజ" వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ రఫ్ లుక్ తో నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "RED" మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’కి 8 ఏళ్ళు
“నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది”.. అంటూ 8 ఏళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేల్చిన పంచ్ డైలాగ్ థియేటర్లలో ఏ స్థాయిలో పేలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా అదే బాట పట్టింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇందులో పవన్‌కు జోడిగా శ్రుతి హాసన్ నటించింది…
బాలకృష్ణ చిత్రంలో 'స్వయంవరం' హీరో?
తొట్టెంపూడి వేణు.. నిన్నటి తరం ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. 'స్వయంవరం', 'చిరునవ్వుతో', 'హనుమాన్ జంక్షన్', 'పెళ్ళాం ఊరెళితే', 'కళ్యాణరాముడు', 'యమగోల మళ్ళీ మొదలైంది'.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. అయితే, ఆ తర్వాత ఆశించిన విజయాలు దక్కకపోవడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందించిన 'దమ్ము' చిత్రంలో కీలక పాత్ర పోషించాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. కాగా, త్వరలోనే మరో నందమూరి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట వేణు.