రియల్ హీరో గా మారిన రీల్ విలన్

Bollywood Actor Sonu Sood Proves His Generosity Once Again By Arranging Buses To Migrant Workers

“సూపర్ “, “అతడు “, అరుంధతి”, ” దూకుడు”, “జులాయి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో విలన్ గా ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటుడు సోను సూద్ తమిళ, కన్నడ మూవీస్ లో కూడా నటించారు. “అరుంధతి ” మూవీ లో పశుపతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోను సూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 2దశాబ్దాలుగా ప్రతినాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న సోను సూద్ కరోనా బాధితులను ఆదుకుంటూ రియల్ హీరో గా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వాలతో పాటు సినీ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందిస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర వైద్య సిబ్బందికి 1500 PPE కిట్స్ అందజేసిన సోను సూద్ ముంబై లోని జుహు లో ఉన్న తన హోటల్ లో కోవిడ్ -19 పేషేంట్స్ కు సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి బస ఏర్పాటు చేశారు . ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించడానికి 10 ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకుని కార్మికులకు ఏర్పాటు చేశారు . బస్సులు ప్రారంభం అయ్యే సమయానికి సోను సూద్ బస్సు స్టాప్ కు చేరుకున్నారు. కార్మికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోను సూద్ మాట్లాడుతూ .. లాక్ డౌన్ కారణంగా ముంబై లో పిల్లలు, వృద్ధులు బాధపడటం తనను కదిలించిందని, కేవలం ఈ రెండు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోను సూద్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + seven =