టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో కొంత మంది హీరోల పేర్లు టక్కున వచ్చేస్తాయి. అయితే వారిలో కూడా ముందొచ్చే పేరు రానా. రానా పెళ్లి, ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు హాట్ టాపిక్కే . ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ఇక ఇన్ని రోజులు తన పెళ్లి గురించి.. ప్రేమ గురించి ఏ ప్రశ్నలు అడిగినా నవ్వుతో సమాధానం చెప్పే రానా తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఓ సర్పైజ్ ఇచ్చాడు. మామూలు విషయం కాదు తన ప్రేయసిని పరిచయం చేశాడు. తన ప్రపోజల్ కి ఆమె ఎస్ అన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పాటు వారి ఫోటోను కూడా పంచుకున్నాడు. చాలా కాలంగా రానా పెళ్లి పై వార్తలు వస్తుండగా నేడు ఆయన కాబోయే భార్యను పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చాడు. త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కేనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
And she said Yes 🙂 ❤️ pic.twitter.com/iu1GZxhTeN
— Rana Daggubati (@RanaDaggubati) May 12, 2020
మొత్తానికి టాలీవుడ్ బ్యాచిలర్స్ అందరూ తమ బ్యాచిలర్ జీవితానికి స్వస్తిపలుకుతున్నారు. ఇప్పటికే నితిన్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నిఖిల్ కూడా లైన్ లో ఉన్నాడు. సాయి తేజ్ కూడా త్వరలోనే తన పెళ్లి ఉండబోతుందని చెప్పాడు. ఇప్పుడు రానా కూడా తన ప్రేయసిని పరిచయం చేసాడు. మరి తన ఫ్రెండ్ ను చూసైనా ప్రభాస్ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కుతాడేమో చూద్దాం..




ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























