
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 100


సాయిధరమ్‌కి జోడీగా రష్మిక?

అఖిల్‌కి జోడీగా `టాక్సీవాలా` భామ?

ఇప్పుడు టైమ్ నాది - క్రిష్ పై కంగన ఆగ్రహం

కోలుకున్న యాక్షన్ హీరో - బ్యాక్ టు వర్క్

వెంకీమామ మూవీ అప్ డేట్ - అల్లుడికి మామ వెల్ కమ్

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ నుండి మరో లుక్

అబ్బాయ్ పై బాబాయ్ ప్రశంసలు

మరో కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్?

రవితేజతో వి.వి.వినాయక్ నెక్ట్స్ ప్రాజెక్ట్?

నాని, శర్వానంద్ ఒకే తేదిని టార్గెట్ చేశారా?

వినరా సోదర వీరకుమారా ట్రైలర్ రిలీజ్

మరోసారి తన సత్తా చాటిన లేడి సూపర్ స్టార్

ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్?

స్పెషల్ డే రోజు షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2!

అల్లు అర్జున్‌తో ముచ్చటగా మూడోసారి...?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి కలిసొచ్చిన సంగీత దర్శకులలో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్ ఒకరు. బన్నీ, తమన్ కాంబినేషన్‌లో వచ్చిన `రేసుగుర్రం`, `సరైనోడు` మ్యూజికల్‌గా మెప్పించడమే కాదు... బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయి. అలాంటి... ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి మరో సినిమా రాబోతోందని టాలీవుడ్ టాక్.

సాయిధరమ్‌కి జోడీగా రష్మిక?
`ఛలో`, `గీత గోవిందం` వంటి వరుస విజయాలతో తెలుగు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కథానాయిక రష్మిక. ఆ తరువాత `దేవదాస్` సినిమాలోనూ అలరించిన ఈ కన్నడ బ్యూటీ... ప్రస్తుతం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న `డియర్ కామ్రేడ్`తో బిజీగా ఉంది. అలాగే త్వరలోనే పట్టాలెక్కనున్న నితిన్ `భీష్మ`లోనూ రష్మిక నాయికగా నటించనుంది.

యన్టీఆర్ బ్లాక్‌బస్టర్ మూవీ `కథానాయకుడు`కి 50 ఏళ్ళు
మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్ ఉన్నాయి. వాటిలో `కథానాయకుడు` ఒకటి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి కె.హేమంబరధరరావు దర్శకత్వం వహించారు. గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై గోపాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో యన్టీఆర్‌కి జోడీగా జయలలిత నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో నాగభూషణం, చిత్తూరు వి.నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు తదితరులు నటించారు. టి.వి.రాజు సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా... `ముత్యాల జల్లు కురిసే`, `మంచివాడు మా బాబాయి`…

అఖిల్‌కి జోడీగా `టాక్సీవాలా` భామ?
`అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలతో అలరించిన యువ కథానాయకుడు అక్కినేని అఖిల్... తన తదుపరి సినిమాని `బొమ్మరిల్లు` భాస్కర్ కాంబినేషన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

ఇప్పుడు టైమ్ నాది - క్రిష్ పై కంగన ఆగ్రహం
ఇప్పుడు ప్రశ్నించే టైమ్ నాది అంటుంది బాలీవుడు క్వీన్ కంగనా రనౌత్. ఇంతకీ ఏం ప్రశ్నిస్తుంది...? ఎవరిని ప్రశ్నిస్తుందనే కదా డౌట్. ఇంకెవర్నీ డైరెక్టర్ క్రిష్ ను. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందు ఎందుకో సైలెంట్ గా ఉన్నా క్రిష్ సినిమా రిలీజ్ అయిన తరువాత.. ఈ సినిమాకు తానే 70 శాతం షూటింగ్ చేశానని.. సినిమాలో నేను చేసిందే ఉందని చెప్పడంతో ఈ సినిమా మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఆ తరువాత కొంత మంది క్రిష్ కు మద్దతు పలుకగా మరి కొంత మంది కంగనాకు మద్దతు పలికారు.

కోలుకున్న యాక్షన్ హీరో - బ్యాక్ టు వర్క్
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయం లో బైక్ స్కిడ్ అయి గోపీచంద్ కు గాయాలైన సంగతి కూడా విదితమే. ఈ ప్రమాదంలో గోపిచంద్ కు పెద్ద ప్రమాదం జరగలేదు కానీ స్వల్ప గాయాలయ్యాయి.

వెంకీమామ మూవీ అప్ డేట్ - అల్లుడికి మామ వెల్ కమ్
బాబి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ లో వెంకీ మామ అనే మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రెండు రోజుల క్రితమే ప్రారంభించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా షూటింగ్ తాజా అప్ డేట్ ఏంటంటే... ప్రస్తుతం గోదావరి నది ఒడ్డున షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో చైతు ఇంట్రడక్షన్ సీన్ ను తీస్తున్నాడట. వెంకటేష్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. విలేజ్ లోకి చైతుకి వెంకటేష్ వెల్ కమ్ చెప్పే సన్నివేశం చిత్రీకరిస్తున్నారట. మరి చూడబోతే ఎఫ్2తో సందడి చేసిన వెంకీ.. అల్లుడు తో కలిసి మరోసారి సందడి చేసేలా కనిపిస్తున్నాడు.

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ నుండి మరో లుక్
‘వినాయకుడు’ ఫేమ్ అడివి సాయి కిరణ్ దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కమాండో అర్జున్ పండిట్ పాత్రలో నటిస్తున్న ఆది లుక్ న ఇటీవలే ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా.. ఈసారి ఓ మంచి కాన్సెప్ట్ తో ఆది వస్తున్నాడన్నా అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన అబ్బూరి రవి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నార. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా రేపు అబ్బూరి రవి ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.

అబ్బాయ్ పై బాబాయ్ ప్రశంసలు
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా 118 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నిన్న ప్రిలీజ్ ఈవెంజ్ నిర్వహించారు.ఇక ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు.

మరో కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్?
కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుండే కథానాయకుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. కళ్యాణ్ రామ్ చిత్రాల ద్వారా పరిచయమైన దర్శకులు సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి... ప్రస్తుతం టాప్ డైరెక్టర్‌ల లిస్ట్‌లో ఉన్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న కళ్యాణ్ రామ్... మరో నూతన దర్శకుడితో పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడట.

కౌషల్ పై కౌషల్ ఆర్మీ ఫైర్
బిగ్ బాస్2.. బిగ్ బాస్ 1 ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు పోయిందో ఎవరికి కూడా తెలియదు కానీ.. బిగ్ బాస్2 మాత్రం ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. అంతలా ఈ సీజన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీనికి కారణం మనందరికీ తెలిసిందేక. కౌషల్ మండా. మొదటి రెండు వారాలు బిగ్ బాస్ సీజన్ 2 ను పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు ఆ గేమ్ షాలో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అయిన కిరిటీ కెప్టన్ టాస్క్ లో కౌషల్ పై కాస్త అతిగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా గేమ్ మారిపోయింది. ఆ రోజు నుండి గేమ్ పైనా... ముఖ్యంగా కౌషల్ పైన ప్రేక్షకులు కాన్సన్ ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు.

హ‌్యాట్రిక్‌కి సిద్ధమవుతున్న కాంబినేషన్స్
కొన్ని కాంబినేషన్‌లు బాక్సాఫీస్ వద్ద భలేగా మ్యాజిక్ చేస్తాయి. అందుకే వారి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందంటే... సహజంగానే ఆసక్తి, అంచనాలు పెరుగుతాయి. ప్రస్తుతం... అలా మూడు కాంబినేషన్(హీరో-డైరెక్టర్)లు హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

రవితేజతో వి.వి.వినాయక్ నెక్ట్స్ ప్రాజెక్ట్?
మాస్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ శైలే వేరు. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ కలసి పనిచేయడమే కాదు... పలు విజయాలను కూడా అందుకున్నారాయన. సుదీర్ఘ విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ- ఎంట్రీ ఇచ్చిన `ఖైదీ నంబర్ 150`ని కూడా జనరంజకంగా తెరకెక్కించి... అలరించాడు వినాయక్.

నాని, శర్వానంద్ ఒకే తేదిని టార్గెట్ చేశారా?
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం `జెర్సీ`, శర్వానంద్ పేరు నిర్ణయించని అప్‌కమింగ్ ప్రాజెక్ట్ (సుధీర్ వర్మ దర్శకుడు)... వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య నెలకి పైగా గ్యాప్ ఉండనుంది. అయితే... ఈ ఇద్దరి తదుపరి చిత్రాలు మాత్రం ఒకే రోజున విడుదలయ్యే అవకాశముందని టాలీవుడ్ టాక్.

సామ్ `మాయ`కి 9 ఏళ్ళు
ఇప్పటి కథానాయికల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోయిన్ ఎవరంటే... నిస్సంకోచంగా వినిపించే పేరు అందాల తార సమంతనే. `ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్` అంటారు... అలా తొలి అడుగులోనే ఎంతో ఇంప్రెస్ చేసి మరీ విజయాన్ని అందుకున్న ఈ చెన్నై బ్యూటీ... ఆ తరువాత వెనక్కు తిరిగి చూసే పరిస్థితి రాలేదు. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా తొమ్మిదేళ్ళుగా వెండితెరపై అందాల సామ్ చేస్తున్న `మాయ`కి ముగ్థులై ఇంకా ఆ మైమరపులోనే ఉన్నారు ఆమె అభిమానులు.

వినరా సోదర వీరకుమారా ట్రైలర్ రిలీజ్
శ్రీనివాససాయి, ప్రియాంకజైన్ హీరో హీరోయిన్లుగా ‘ వినరా సోదర వీరకుమారా‘ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై లక్ష్మణ్ క్యాదారి నిర్మిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాలోని ఒక పాట తెల్లవారి కోడికన్న ముందు లేసి.. అనే పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఎన్టీఆర్ మహానాయకుడు త్రీ డేస్ కలెక్షన్స్
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాగానే మౌత్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల్ పరంగా కాస్త ఢీలా పడిందనే చెప్పొచ్చు. మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2 కోట్లు మాత్రమే రాబట్టిందంటేనే అర్ధంచేసుకోవచ్చు.. కలెక్షన్ల్ పరంగా ఈ సినిమా ఎంత వీక్ ఉందో. మరి ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

మరోసారి తన సత్తా చాటిన లేడి సూపర్ స్టార్
నయనతార, అనురాగ్ కశ్యప్, విజయ్ సేతుపతి, అథర్వా , రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇమైక్క నొడిగళ్. తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాను తెలుగులో అంజలి సీబీఐ అనే పేరుతో నిన్న విడుదల చేశారు. ఇక తెలుగులో రిలీజైన ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్లను అధికారికంగా ప్రకటించారు. ఒక హీరోయిన్ నిథి అగర్వాల్ ను ఎంపిక చేయగా.. మరో హీరోయిన్ నభానటేష్ ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ ది ఫుల్ మాస్, తెలంగాణ యాస మాట్లాడే కారెక్టర్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

స్పెషల్ డే రోజు షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2!
సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. భారీ బడ్జెట్ తో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో షేడ్స్ ఆఫ్ చాప్టర్ 1 అంటూ ఇటీవల ఓ వీడియోను విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2 అంటూ మరో వీడియో ను విడుదల చేయనున్నారు. మార్చి 3వ తేదీన శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా చాప్టర్ 2ను విడుదలచేయనున్నారు.