`ఛలో`, `గీత గోవిందం` వంటి వరుస విజయాలతో తెలుగు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కథానాయిక రష్మిక. ఆ తరువాత `దేవదాస్` సినిమాలోనూ అలరించిన ఈ కన్నడ బ్యూటీ… ప్రస్తుతం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న `డియర్ కామ్రేడ్`తో బిజీగా ఉంది. అలాగే త్వరలోనే పట్టాలెక్కనున్న నితిన్ `భీష్మ`లోనూ రష్మిక నాయికగా నటించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇప్పటివరకు మెగా కాంపౌండ్ హీరోలతో కలసి నటించని ఈ అమ్మడు… త్వరలోనే ఆ కాంపౌండ్ హీరోతో ఓ సినిమా చేయనుందట. ఆ హీరో మరెవరో కాదు… సాయిధరమ్ తేజ్. యూత్‌ఫుల్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఓ దర్శకుడు రూపొందించనున్న చిత్రంలో సాయిధరమ్ హీరోగా నటించనుండగా… అతనికి జోడీగా రష్మిక ఎంపికైందని సమాచారం. అంతేకాదు… `గీత గోవిందం` చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండడంతో రష్మిక వెనువెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే సాయిధరమ్, రష్మిక కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=03Mk3HEzRdM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: