మాస్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ శైలే వేరు. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ కలసి పనిచేయడమే కాదు… పలు విజయాలను కూడా అందుకున్నారాయన. సుదీర్ఘ విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ- ఎంట్రీ ఇచ్చిన `ఖైదీ నంబర్ 150`ని కూడా జనరంజకంగా తెరకెక్కించి… అలరించాడు వినాయక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే… ఆ సినిమా తరువాత మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఈ మాస్ డైరెక్టర్ రూపొందించిన `ఇంటిలిజెంట్` ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో… తదుపరి చిత్రానికి భారీ విరామమే తీసుకున్నారాయన. ఆ మధ్య… నటసింహ నందమూరి బాలకృష్ణతో వినాయక్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… మాస్ మహరాజా రవితేజతో వినయ్ తదుపరి చిత్రం ఉంటుందని తెలిసింది. ఇప్పటికే వినయ్ చెప్పిన స్క్రిప్ట్‌కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని… అలాగే ఈ ఏడాది సెకండాఫ్‌లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్. సి.కళ్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం… రవితేజ సైంటిఫిక్ ఫిక్షన్ `డిస్కో రాజా`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
[youtube_video videoid=Y8puRGYfnUY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: