హ‌్యాట్రిక్‌కి సిద్ధ‌మ‌వుతున్న కాంబినేష‌న్స్‌

Hat Trick Combinations In Tollywood Are Getting Ready,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Upcoming Tollywood Best Combination Movies in 2019,Telugu Stars Hat Trick Combinations Movies Are Getting Ready,Tollywood Stars Movies Hat Trick Combos on Charts
Hat Trick Combinations In Tollywood Are Getting Ready

 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్ని కాంబినేష‌న్‌లు బాక్సాఫీస్ వ‌ద్ద భ‌లేగా మ్యాజిక్ చేస్తాయి. అందుకే వారి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తుందంటే… స‌హ‌జంగానే ఆస‌క్తి, అంచ‌నాలు పెరుగుతాయి. ప్ర‌స్తుతం… అలా మూడు కాంబినేష‌న్‌(హీరో-డైరెక్ట‌ర్‌)లు హ్యాట్రిక్ కోసం సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే…

నంద‌మూరి బాల‌కృష్ణ‌- బోయ‌పాటి శ్రీ‌ను:

న‌ట‌సింహ బాల‌కృష్ణ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీస్ `సింహా`, `లెజెండ్‌`. బోయ‌పాటి శ్రీ‌ను రూపొందించిన ఈ చిత్రాల‌కి `సెప‌రేట్ ఫ్యాన్ బేస్` ఉంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అలాంటి… ఈ కాంబినేష‌న్ ఐదేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు సిద్ధ‌మ‌వుతోంది. జూన్‌లో ప్రారంభం కానున్న ఈ సినిమా… వ‌చ్చే ఏడాది సంక్రాంతికి తెర‌పైకి రానుంది.

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌… ఈ కాంబినేష‌న్ పేరు వింటే గుర్తొచ్చే సినిమా `జులాయి`. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది. ఆ త‌రువాత వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` కూడా విజ‌యం సాధించింది. నాలుగేళ్ళ విరామం త‌రువాత‌… వీరి కాంబోలో హ్యాట్రిక్ అటెంప్ట్ కి ప్లాన్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీ… ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెల్యులాయిడ్ పైకి రానుంది.

నాని – ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌:

నేచుర‌ల్ స్టార్ నానిని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన చిత్రం `అష్టా చ‌మ్మా`. ఆ సినిమాని సెన్సిబుల్ డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ రూపొందించారు. ఆ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `జెంటిల్ మ‌న్‌` కూడా మంచి విజ‌యం సాధించింది. మూడేళ్ళ విరామం త‌రువాత‌… ఈ ఇద్ద‌రూ ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌డుతున్నారు. అయితే… ఈ సారి వీరి కాంబినేష‌న్‌లో రానున్న చిత్రంలో నానిది క‌థానాయ‌కుడి పాత్ర కాక‌పోవ‌డం విశేషం. ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన అతిథి పాత్ర‌లో నాని ద‌ర్శ‌న‌మిస్తాడ‌ట‌. నాని 25వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం… ఈ ఏడాది చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రి… ఆయా కాంబినేష‌న్‌ల‌కు స‌ద‌రు చిత్రాలు హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందిస్తాయేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=HOcp8T7TM1g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 11 =