నయనతార, అనురాగ్ కశ్యప్, విజయ్ సేతుపతి, అథర్వా , రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇమైక్క నొడిగళ్. తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాను తెలుగులో అంజలి సీబీఐ అనే పేరుతో నిన్న విడుదల చేశారు. ఇక తెలుగులో రిలీజైన ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ నయన్ అని చెప్పొచ్చు. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్లో నటిస్తూనే…మరోవైపు అగ్ర హీరోలు నటించే సినిమాల్లో కథానాయికగ నటిస్తూ దూకుడు మీదుంది నయనతార. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు అయిపోయినా కానీ ఇంకా అదే అందం..అభినయంతో దూసుకుపోతుంది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైన నయన్ ఆ తరువాత ఆ తరవాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడం మొదలుపెట్టారు. అలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా ఎదిగారు.
ఇక ఈ సినిమాలో ఎప్పటిలాగే నయన్ తన నటనతో రెచ్చిపోయింది. లేడి సూపర్ స్టార్ అని ఆమెకు పెట్టిన పేరును సార్థకం చేసింది. సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించిన నయన తార తన పాత్రను రక్తికట్టించింది. ఓ సైకో వరుస హత్యలతో చెలరేగిపోతుండగా, అతడిని అంతం చేసే ఆఫీసర్ పాత్రలో మరోసారి అదుర్స్ అనిపించింది. తన హావభావాలు కానీ.. ఒక సిబిఐ ఆఫీసర్ కు కావాల్సిన లుక్ కానీ అన్నీ ఫర్ఫెక్ట్ గా సెట్టయ్యాయి. ఇలాంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ పాత్రలు గతంలో చేసినా..మరోసారి అంజలి పాత్రలో ఒదిగిపోయి నటించి సినిమాకే పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దాంతో తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
[youtube_video videoid=uaWUv_RoNkI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: