
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 101


చైతు కోసం విషాదాంతమైన ప్రేమ కథ!

యాత్ర త్రీ వీక్స్ కలెక్షన్స్

ఇంద్రగంటి సినిమాలో నాని డిఫరెంట్ రోల్

రజనీకాంత్ తరువాత ధనుష్‌తో...?

విశ్వామిత్ర ట్రైలర్ రిలీజ్

ఈ ఏడాది మూడు సినిమాలతో సందడి చేయనున్న నాని!

`జెర్సీ`లో నాని స్పెషల్ టచ్...

చైతూకి అప్పుడు అతిథులు... ఇప్పుడేమో కో-స్టార్

కార్తికి జోడీగా రష్మిక

లవర్స్ డే కొత్త క్లైమాక్స్ వచ్చేస్తుంది

మామ అల్లుళ్ళ పక్కన హీరోయిన్స్ ఫిక్స్

నాని 24 టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్

దిల్ రాజు చేతిలోకి ఆంధ్రా, నైజాం హక్కులు

తమన్నా నటనకు ప్రశంసలు

కోడి రామకృష్ణ గురించి తెలియని కొన్ని నిజాలు

పల్లెటూరి అమ్మాయిగా పాయల్ రాజ్‌పుత్

ఇన్నాళ్లకు ఇండియన్ డాక్యుమెంటరీకి ఆస్కార్
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 91వ ఆస్కార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే ఈసారి మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది.రేకా జెహతాబ్చి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్' అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అవ్వడం తప్ప అవార్డును గెలుచుకోలేకపోయాయి. కానీ ఈ 25 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీకి అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ఇన్నాళ్లకు మనకు ఆస్కార్ అవార్డ్ లభించడం గర్వించతగ్గ విషయమే.

చైతు కోసం విషాదాంతమైన ప్రేమ కథ!
తెలుగులోనే కాదు అటు హిందీ సినిమాలకూ కథలు అందించి...అసాధారణమైన విజయాలను అందించిన రైటర్ కమ్ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, సమరసింహా రెడ్డి మరియు తన తనయుడు రాజమౌళి సినిమాలు విక్రమార్కుడు, ఛత్రపతి, యమదొంగ, మగధీర, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించారు ఈయన. ఇక హిందీలో భజరంగీ భాయిజాన్, మణికర్ణిక సినిమాలకూ కథలు అందించారు. అవి కూడా మంచి విజయాలు సాధించినవే. అలాంటి నేపథ్యంలో ఆయన ఒక కథను రచన చేస్తున్నాడనగానే సహజంగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి కదా.

యాత్ర త్రీ వీక్స్ కలెక్షన్స్
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో వి. మహి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర మంచి టాక్ ను సొంతం చేసుకొని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మరి ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు త్రీ వీక్స్ అవ్వొస్తుంది. ఈ త్రీ వీక్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

ఇంద్రగంటి సినిమాలో నాని డిఫరెంట్ రోల్
నేచురల్ స్టార్ నాని, సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. నాని తొలి చిత్రం `అష్టా చమ్మా`తో పాటు మూడేళ్ళ క్రితం వచ్చిన `జెంటిల్ మన్`కి కూడా ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో... ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రానుంది. అయితే... ఈ సారి పూర్తిస్థాయి కథానాయకుడి పాత్రలో కనిపించడం లేదు నాని. కాకపోతే... పాత్ర పరిధి తక్కువ అయినా... ఓ డిఫరెంట్ రోల్‌లో దర్శనమిస్తాడట.

వన్ మెన్ ఆర్మీ ఫస్ట్ లుక్ రిలీజ్
నూతన దర్శకుడు శివ దర్శకత్వంలో.. సందీప్ చీలంను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమా వన్ మెన్ ఆర్మీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరకుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే జరుపుకుంటుంది ఈ సినిమా. ఇదిలా ఉండంగా ఈరోజు హీరో సందీప్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

రజనీకాంత్ తరువాత ధనుష్‌తో...?
తన తొలి చిత్రం `పిజ్జా`తో తమిళ ప్రేక్షకులనే కాదు తెలుగు ప్రేక్షకులనూ అలరించాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. ఆ తరువాత రూపొందించిన `జిగర్తండా`(ఇప్పుడు ఇదే సినిమాని హరీష్ శంకర్ `వాల్మీకి`గా తెరకెక్కిస్తున్నాడు)తో దర్శకుడిగా మరో మెట్టు ఎదిగాడు. తదనంతరం `ఇరైవి`, `మెర్క్యురీ` చిత్రాలతోనూ తమిళ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన కార్తిక్... ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో `పేట`తో పలకరించాడు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రజనీ అభిమానుల మనసు దోచుకున్నాడు ఈ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్.

`118` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా బాలకృష్ణ, యన్టీఆర్!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `118`. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి కె.వి.గుహన్ దర్శకత్వం వహించగా... మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి... సెన్సార్ కమిటీ `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. మార్చి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

విశ్వామిత్ర ట్రైలర్ రిలీజ్
గీతాంజలి, త్రిపుర వంచి థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేసిన డైరెక్టర్ రాజ కిరణ్. ఇప్పుడు మరోసారి అలాంటి జోనర్ లోనే విశ్వామిత్ర అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాడు. నందితా శ్వేత, సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్న కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాను మార్చి 21వ తేదీన రిలిజ్ చేయనున్నారు. ఇప్పుడుతాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ ఏడాది మూడు సినిమాలతో సందడి చేయనున్న నాని!
ఆ మధ్యంతా ఏడాదికి మూడు సినిమాలతో సందడి చేసిన యువ కథానాయకుడు నాని... గత ఏడాది మాత్రం కేవలం రెండు చిత్రాలకే పరిమితమయ్యాడు. నిరుడు `కృష్ణార్జున యుద్ధం`, `దేవదాస్` సినిమాలతో పలకరించిన ఈ నేచురల్ స్టార్... ఈ సంవత్సరం మాత్రం మరోసారి మూడు సినిమాలతో సందడి చేయనున్నాడు.

`జెర్సీ`లో నాని స్పెషల్ టచ్...
నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `జెర్సీ` విడుదలకు ముస్తాబవుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో ఈ సినిమా తెరపైకి రానుంది. `మళ్ళీ రావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాని... మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్‌గా కనిపించనున్నాడు. అంతేకాదు... తన వయసుకు మించిన పాత్రలో తొలిసారిగా దర్శనమివ్వనున్నాడు ఈ నేచురల్ స్టార్.

చైతూకి అప్పుడు అతిథులు... ఇప్పుడేమో కో-స్టార్
యువ కథానాయకుడు నాగచైతన్య... ఇటీవలే `మజిలీ` చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ రోజు (ఆదివారం) నుంచి కొత్త చిత్రం `వెంకీ మామ` షూటింగ్‌తో బిజీ కానున్నాడు. ఈ సినిమాలో తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో సందడి చేయనున్నాడు చైతూ. అలాగే అతనికి జోడీగా రాశీ ఖన్నా నటించనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... అటు వెంకీ, ఇటు రాశి... ఇద్దరూ కూడా ఇంతకుముందు చైతూ సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించి సదరు అక్కినేని యంగ్ హీరోకి కలిసొచ్చారు.

కార్తికి జోడీగా రష్మిక
గత ఏడాది ఆరంభంలో విడుదలైన `ఛలో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఆ తరువాత `గీత గోవిందం`సినిమాలో గీత పాత్రలో ఒదిగిపోయి... యువతరానికి మరింత దగ్గరైంది. ప్రస్తుతం... `గీత గోవిందం` కథానాయకుడు విజయ్ దేవరకొండతో కలసి `డియర్ కామ్రేడ్`లో నటిస్తున్న రష్మిక... అతి త్వరలో పట్టాలెక్కనున్న నితిన్ `భీష్మ`లోనూ నాయికగా కనిపించనుంది.

లవర్స్ డే కొత్త క్లైమాక్స్ వచ్చేస్తుంది
ప్రియా ప్రకాష్ వారియర్... ఈ ఒక్క పేరే ప్రేక్షకులను థియేటర్స్ వరకూ వెళ్లేలా చేసింది. దానికి కారణం ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్సే కారణం. ఒక్క పాటలో తన ఎక్స్ ప్రెషన్స్ తో యావత్ దేశం మొత్తం తనవైపు చూసేలా చేసింది. మరి అంత క్రేజ్ వచ్చిన తరువాత సినిమాపై ఎలాగూ అంచనాలు ఉంటాయి కదా. కానీ దురదృష్టవశాత్తు సినిమాకు అనుకున్నంత టాక్ రాలేదు. ఎన్నో అంచనాల మధ్య రిలీజై కాస్త నిరాశపరిచింది.

మామ అల్లుళ్ళ పక్కన హీరోయిన్స్ ఫిక్స్
ఫైనల్లీ వెంకీమామ సినిమాలో మామ అల్లుళ్ళతో జతకట్టే హీరోయిన్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. వెంకీ సరసన శ్రియ, చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ అంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తుండగా..ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చేశారు. వెంకీమామ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా వెంకీ, చైతుతో కలిసి సందడి చేయనున్నట్టు సురేష్ ప్రొడక్షన్స్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇక రేపటి నుండి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభంకానుందని కూడా తెలిపారు.

నాని 24 టైటిల్ రివీల్ డేట్ ఫిక్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇటీవలే లాంఛనంగా ప్రారంభించగా రేపటి నుండి రెగ్యూలర్ గా షూటింగ్ జరుపుకోనుంది. ఇదిలా ఉండంగా ఈ సినిమా టైటిల్ ను ఇప్పటివరకూ ప్రకటించని చిత్రయూనిట్ దానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు విక్రమ్-నానిల కొత్త సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

ఎన్టీఆర్ మహానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పార్ట్ కూడా అనుకున్నంత లేదని.. రాజకీయ జీవితాన్ని కూడా అసంపూర్ణంగానే చూపించారన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో టోటల్ గా ఎన్టీఆర్ జీవిత్ర చరిత్ర ఆధారంగా తీసిన ఆయన బయోపిక్ అసంపూర్ణంగానే ముగిసింది. ఇక కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

దిల్ రాజు చేతిలోకి ఆంధ్రా, నైజాం హక్కులు
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 118. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను మార్చి 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రాగా సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

తమన్నా నటనకు ప్రశంసలు
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ తరం కథానాయికల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ముఖ్యంగా... తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ ఓరియెంటెడ్ రోల్స్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లోనూ తన మార్క్ నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు... మరోసారి నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది తమన్నా.

కోడి రామకృష్ణ గురించి తెలియని కొన్ని నిజాలు
కేవలం ఒక్క జోనర్ కు మాత్రమే పరిమితం కాకుండా సోషల్, హార్రర్, పొలిటికల్, డివోషనల్, గ్రాఫిక్స్ ఇలా అన్ని జోనర్లలో సినిమాలు తీసిన ద వర్సటైల్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కోడి రామకృష్ణ అని ముక్త కంఠంతో చెప్పొచ్చు. 1982 ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఎంతో మందిని టాప్ హీరోలుగా తీర్చిదిద్దారు. దాదాపు వందకి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన ఘనత. అలాంటి కోడి రామకృష్ణ జీవితంలో ఎన్నో మనకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.. వాటిలో మచ్చుకు కొన్ని..

పల్లెటూరి అమ్మాయిగా పాయల్ రాజ్‌పుత్
గత ఏడాది సంచలన విజయం సాధించిన `ఆర్ ఎక్స్ 100` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే యువతరంలో మంచి ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న పాయల్... `ఆర్ ఎక్స్ 100` తరువాత ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తోంది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో... పాయల్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుంది.