కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 99

Viswasam Telugu Movie Mouth Talk,Viswasam Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Viswasam Movie Review,Viswasam Review,Viswasam Telugu Movie Review
సినిమా వార్తలు

విశ్వాసం తెలుగు మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Heroines Fixed For Rajinikanth And AR Murugadoss Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth And AR Murugadoss New Movie Heroine,Keerthy Suresh Next With Super Star RajiniKanth,Rajinikant
సినిమా వార్తలు

సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన మహానటి

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ఇక మురగదాస్ సమాజానికి కాస్త దగ్గరగా ఉండే కథలను తీస్తుంటారు కాబట్టి అప్పుడే ఈసినిమాపై కూడా పలు రకాల టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో ఉంటుందని.. టైటిల్ కూడా నార్కాలి అని ఖరారు చేశారని ఇలా పలు రకాల రూమర్లే వినిపించాయి. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదు.. అన్ని వర్గాలకు నచ్చే మాస్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నట్టు మురగదాస్ క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Dear Comrade Movie Release Date Gets Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dear Comrade Movie Release Date Fixed,Dear Comrade Movie Release Date Confirmed,Dear Comrade Movie Release Date Annou
రిలీజ్ అప్‌డేట్

`డియ‌ర్ కామ్రేడ్‌` రిలీజ్ డేట్ ఫిక్స‌య్యిందా?

`గీత గోవిందం`వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సెన్సేష‌న‌ల్ బ్యూటీ ర‌ష్మిక మంద‌ణ్ణ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. నూత‌న ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టూడెంట్ యూనియ‌న్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా... ర‌ష్మిక క్రికెట‌ర్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుందని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Mahesh Babu was the First choice for Yamaleela,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Yamaleela Telugu Movie Latest Updates,Mahesh Babu First Movie choice For Yamaleela,Mahesh Babu Initial choice for
సినిమా వార్తలు

యమలీల మూవీలో మహేష్ బాబు ?

ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం లో హాస్యనటుడు అలీ హీరోగా 1994 సంవత్సరం లో రూపొందిన యమలీల మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. యమలీల మూవీ లో నటించడానికి ఫస్ట్ ఛాయిస్ బాల నటుడిగా సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణను దర్శకుడు కృష్ణారెడ్డి సంప్రదించగా మహేష్ బాబు స్టడీస్ తో బిజీగా ఉన్నాడని, కృష్ణ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. అలీ కి యమలీల మూవీ లో హీరోగా నటించే ఛాన్స్ దక్కింది.

Team TFNవాట్సాప్
28°C Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hero Naveen Chandra Upcoming Films in 2019,Naveen Chandra New Movie Updates,Naveen Chandra Next Project Details,Naveen Chandra New
ఫస్ట్ లుక్

28 డిగ్రీస్ సెల్సియస్ ఫస్ట్ లుక్ రిలీజ్

అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నవీన్‌ చంద్ర తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత పలు సినిమాల్లో నటించినా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. దాంతో కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించాడు. అయితే ఇప్పుడు మళ్లీ హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ.. మరోసారి తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు.

TFN Adminవాట్సాప్
RX 100 Fame Karthikeya Next Movie Shooting Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Karthikeya Next Project Details,Rx 100 Hero Karthikeya New Film Updates,Karthikeya Upcoming Movies in 2019,Hero
షూటింగ్ అప్‌డేట్

కొత్త సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ.. ‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ బ్యానర్లపై అనిల్‌ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈసినిమా తాజా అప్ డేట్ ఏంటంటే...ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఒంగోలులో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ నేటితో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్
రిలీజ్ అప్‌డేట్

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈసినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. వర్మ తీసుకున్న పాయింటే అలాంటిది. ఎవరూ టచ్ చేయని.. టచ్ చేయడానికి భయపడే.. ఎన్టీఆర్ లైఫ్ లో అతి కీలకమైన టైమ్ పీరియడ్ నే సెలక్ట్ చేసుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికీ అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆర్జీవి యూట్యూబ్ చానల్లో కోటికి పైగా మంది…

TFN Adminవాట్సాప్
Sridevi MOM Movie Releases in China,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sridevi Last Film MOM Movie,Sridevi MoM Movie Latest Udates,Sridevi Last Film in China,Sridevi MOM Movie Release in China For
సినిమా వార్తలు

చైనాలో శ్రీదేవి చివరి సినిమా

అలనాటి అందాల తార.. లెజెండరీ నటి శ్రీదేవి తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇంకా మరెన్నో భాషల్లో నటించి బహుబాషా నటిగా మొట్ట మొదటి లేడీ సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకుంది. ఇక వివాహం తరువాత సినిమాలకు దూరమైన శ్రీదేవి ఆ తరువాత ఎన్నో ఏళ్లకు ఇంగ్లీష్ వింగ్లీష్ అనే బాలీవుడ్ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్స్ చేసింది. ఇక తాను నటించిన చివరి సినిమా ‘మామ్’.

TFN Adminవాట్సాప్
RGV Guarantees to SHow Facts in Lakshmi’s NTR,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RGV About Lakshmi’s NTR,RGV About Lakshmi’s NTR Movie Story,RGV Reveals Unknown Facts in Lakshmi’s NTR,Interesting
సినిమా వార్తలు

అందులో నిజం లేదు - మేం క్లారిటీ ఇస్తాం

వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితంలో అతి కీలకమైన పార్ట్ ను తీసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాతో అప్పటి ఘటనలను వెండి తెరపై చూపించనున్నాడు వర్మ. ఇక వర్మ ఎప్పుడైతే ఈసినిమా గురించి ప్రకటన చేశారో అప్పటి నుండి ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. నిజానికి క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు కంటే కూడా వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించే అందరిలో ఆసక్తి ఉంది.

TFN Adminవాట్సాప్
Nivetha Thomas Reveals Story Behind 118 Title,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nivetha Thomas About 118 Movie,118 Telugu Movie Latest Updates,Nivetha Thomas Reveals 118 Movie Story,Nivetha Thoma
సినిమా వార్తలు

118 అంటే అర్థం అదే - నివేథా

ఇటీవలే నా నువ్వేతో అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు 118 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను రేపు (మార్చి1) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. దీనిలో భాగంగానే తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న నివేథా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అసలు 118 అంటే ఏంటి.. తన పాత్ర ఏంటో చెప్పుకొచ్చింది.

TFN Adminవాట్సాప్
Allu Arjun Song in Jr Ntr Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ayogya To Feature Allu Arjun Chartbuster,Allu Arjun Song in Jr Ntr Temper Remake,Vishal Temper Movie Remake Latest Updates,Stylis
సాంగ్

ఎన్టీఆర్ మూవీలో బన్నీ సాంగ్

ప్రస్తుతం విశాల్ టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ టెంపర్ సినిమా రీమేక్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ లో అయోగ్య పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రీమేక్ లో ఓ చిన్న చేంజ్ చేసినట్టు కనిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో నోరా ఫతేహితో ఇట్టాగే రెచ్చిపోదాం స్పెషల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాలో ఆ పాటను రిజెక్ట్ చేశారట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్టయిన బ్లాక్ బస్టర్ సాంగ్ ను పెట్టనున్నారట.. అది కూడా తెలుగులోనే. మరి ఎన్టీఆర్ మూవీలో బన్నీ సాంగ్ అంటే కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా…

TFN Adminవాట్సాప్
Kalyan Ram New Movie in Sriwass Direction,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kalyan Ram Next With Sriwass Director,Kalyan Ram To Feature With Director Sriwass,Hero Kalyan Ram New Movie Updates,Dir
సినిమా వార్తలు

శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్‌?

దాదాపు పుష్క‌రకాలం క్రితం విడుద‌లైన `ల‌క్ష్యం` (2007) చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు శ్రీ‌వాస్‌. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని అందుకున్న శ్రీ‌వాస్‌కి... ఆ త‌రువాత వ‌చ్చిన `రామరామ కృష్ణ కృష్ణ‌`, `పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌` సినిమాలు ఆశించిన విజ‌యాల‌ను అందించ‌లేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో... త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు గోపీచంద్ కాంబినేష‌న్‌లోనే రూపొందించిన `లౌక్యం`తో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు శ్రీ‌వాస్‌. అయితే... ఆ త‌రువాత వ‌చ్చిన `డిక్టేట‌ర్‌`, `సాక్ష్యం` చిత్రాలు నిరాశ‌ప‌రిచాయి.

Team TFNవాట్సాప్
Kalyan Ram Turns Hero for Nivetha Thomas,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Nivetha Thomas in 118 Movie, 118 Telugu Movie Latest Updates,Kalyan Ram and Nivetha Thomas To Pair Up For 118 Mo
సినిమా వార్తలు

నివేదాకి హీరోగానూ క‌లిసొస్తాడా?

`జెంటిల్ మ‌న్‌`, `నిన్ను కోరి`, `జై ల‌వ కుశ‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న ముద్దుగుమ్మ నివేదా థామ‌స్‌. గ్లామ‌ర్ రోల్స్ కంటే పెర్‌ఫార్మెన్స్ రోల్స్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ అందాల తార‌... దాదాపు ఏడాదిన్న‌ర గ్యాప్ త‌రువాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఆ చిత్ర‌మే... `118`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా రేపు (మార్చి 1) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Will Never Forget Those Words – Says Nivetha Thomas,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,118 Movie About Nivetha Thomas,118 Telugu Movie Latest News,Same Sentiment For Nivetha Thomas in 118 Movie,Ni
సినిమా వార్తలు

వారి మాటల్ని మరిచిపోలేను - నివేత థామస్

సూపర్ హిట్ మూవీ జెంటిల్ మన్ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నివేత థామస్ నటించిన నిన్నుకోరి, జై లవకుశ సినిమాలు ఘనవిజయం సాధించాయి. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో నివేత జంటగా నటించిన 118 మూవీ రిలీజ్ సందర్భంగా విలేఖరుల సమావేశం లో నివేత తన మనసులోని మాటల్ని వారితో పంచుకున్నారు.

Team TFNవాట్సాప్
Dulquer Salmaan in Mahi V Raghav Direction,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dulquer Salmaan Next Movie With Yatra Director,Director Mahi V Raghav New Film With Dulquer Salmaan,Dulquer Salmaan Ro
సినిమా వార్తలు

`యాత్ర‌` ద‌ర్శ‌కుడితో దుల్క‌ర్ స‌ల్మాన్‌?

మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నేత వై.ఎస్‌.రాజేశేఖ‌ర రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఓ కీల‌క ఘ‌ట్టం... పాద‌యాత్ర. ఈ పాద‌యాత్ర‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం `యాత్ర‌`. స‌రిగ్గా 20 రోజుల క్రితం విడుద‌లైన `యాత్ర‌` సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. కేర‌ళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో మ‌హి వి.రాఘ‌వ్‌ రూపొందించిన ఈ సినిమా మ‌ల‌యాళంలోనూ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మ‌మ్ముట్టికి ఉన్న క్రేజ్‌తో కేర‌ళ‌లోనూ ఈ చిత్రం మంచి వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకుంది.

Team TFNవాట్సాప్
Sharwanand New Movie Completes Spain Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sharwanand New Movie First Schedule Finished,Actor Sharwanand New Film Shooting Updates,Sharwanand New Movie Next S
షూటింగ్ అప్‌డేట్

స‌్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శ‌ర్వానంద్ తాజా చిత్రం

యంగ్ హీరో శ‌ర్వానంద్‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో శ‌ర్వానంద్‌కి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తొలిసారిగా న‌టిస్తున్నారు. కాగా... గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పెయిన్‌లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా... ఈ షెడ్యూల్ పూర్త‌యింద‌ని స‌మాచారం. దీంతో... ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ దాదాపు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లేన‌ని ఇన్‌సైడ్ సోర్స్ టాక్‌.

Team TFNవాట్సాప్
Samantha in Manmadhudu Sequel,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu Sequel Latest Updates,Actress Samantha in Manmadhudu 2 Movie,Samantha Role in Nagarjuna Manmadhudu 2 Movie,Manmadhudu 2
సినిమా వార్తలు

`మ‌న్మ‌థుడు` సీక్వెల్‌లో సమంత‌?

చెన్నై బ్యూటీ స‌మంత కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచే చిత్రాల‌లో `మనం` ఒక‌టి. అందులో... రెండు విభిన్న పాత్ర‌ల్లో సామ్ అభిన‌యం గుర్తుండిపోతుంది. ముఖ్యంగా... కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేష‌న్‌లో స‌మంత న‌టించిన స‌న్నివేశాలన్నీ అల‌రించేలా ఉంటాయి. `మ‌నం`లో నాగ్‌కి త‌ల్లి పాత్ర‌లో క‌నిపించిన సామ్‌... ఆ త‌రువాత `రాజు గారి గ‌ది 2`లోనూ మ‌రోసారి క‌లిసి న‌టించింది. అయితే... నాగ‌చైత‌న్య‌ని పెళ్ళాడాకా... నాగ్‌తో మ‌ళ్ళీ క‌లసి న‌టించ‌ని సామ్... అతి త్వ‌ర‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Mohan Babu in Mani Ratnam New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mani Ratnam Next Project Details,Mani Ratnam New Film With Mohan Babu,Mohan Babu Upcoming Film With Mani Ratnam,Director Mani
బాక్సాఫీస్

మణిరత్నం మూవీ లో కలెక్షన్ కింగ్

విభిన్న కథా చిత్రాలు రూపొందించే లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఒక భారీ బడ్జెట్ మూవీ రూపొందించనున్నారు. రైటర్ కల్కి తమిళ నవల పొన్నియన్ సెల్వన్ ను తెరకెక్కించనున్నారు. హిస్టారికల్ డ్రామా గా రూపొందనున్న ఈ మూవీలో నటించేందుకు విలక్షణ నటుడు, సీనియర్ హీరో మోహన్ బాబు ను సంప్రదించినట్టు, పలు భాషా నటులతో రూపొందే ఈ మూవీ కి మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Complete Box Office Report of Telugu Movies in this February,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,February Tollywood Movies Box Office Report,Overview of Telugu Movies Collections in February 2019,
స్పెషల్

21 రిలీజ్ లలో ఒక్కటంటే ఒక్క హిట్టూ లేని డిజాస్టర్ మంత్ ఫిబ్రవరి

2019లో రెండవ నెల ఫిబ్రవరి రేపటితో పూర్తవుతుంది. సినిమాల ఫలితాల పరంగా మాసాంత సమీక్ష చూసుకుంటే గుండెలు గుభేల్మంటాయి... ఎంత బ్యాడ్ సీజన్ అయినప్పటికీ ప్రతి నెలలో ఒకటో రెండో హిట్స్ ఉంటాయి. కానీ 2019 ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన సినిమాలను వాటి ఫలితాలను ఒకసారి సమీక్షించుకుని చూస్తే "సినిమాలు తీయడం అవసరమా" అన్నంత దారుణంగా ఉన్నాయి ఫలితాలు. ఈ నెలలో 15 స్ట్రెయిట్ చిత్రాలు , 6 డబ్బింగ్ చిత్రాలు కలుపుకుని మొత్తం 21 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకసారి ఆ జాబితా ఏమిటో చూద్దాం.

Team TFNవాట్సాప్
Nani Coming Up With an Old Title for Sixth Time,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Nani New Movie Updates,Natural Star Nani Coming Up With Old Titles,Nani Next Project Details,Nani Upcoming Films
సినిమా వార్తలు

నాని... ఆరోసారి

పాత సినిమాల టైటిల్స్‌తో కొత్త చిత్రాలు సంద‌డి చేయ‌డం తెలుగు ప‌రిశ్ర‌మ‌లో కొత్తేమీ కాదు. ప్ర‌తీ సంవ‌త్స‌రం ఈ త‌ర‌హా టైటిల్స్‌తో చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో సినిమాలు వ‌స్తుంటాయి. ఇప్పుడు ఈ జాబితాలోనే మ‌రో కొత్త చిత్రం... పాత టైటిల్‌తో సంద‌డి చేయ‌నుంది. అదే... `గ్యాంగ్ లీడ‌ర్‌`.

Team TFNవాట్సాప్

షేర్