ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయం లో బైక్ స్కిడ్ అయి గోపీచంద్ కు గాయాలైన సంగతి కూడా విదితమే. ఈ ప్రమాదంలో గోపిచంద్ కు పెద్ద ప్రమాదం జరగలేదు కానీ స్వల్ప గాయాలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం గోపిచంద్ కోలుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో తను తిరిగి షూటింగ్ లో పాల్గొనున్నట్టు సమాచారం.
కాగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర నిర్మస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అంతేకాదు త్వరగా షూటింగ్ పూర్తిచేసి మే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: