సామ్ `మాయ‌`కి 9 ఏళ్ళు

9 Years For Naga Chaitanya And Samantha Cult Classic Ye Maya Chesave,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,9 Years For Ye Maya Chesave Movie,Naga Chaitanya And Samantha Ye Maya Chesave Movie Latest Updates,Ye Maya Chesave Movie Completed For 9 Years
9 Years For Naga Chaitanya And Samantha Cult Classic Ye Maya Chesave

ఇప్ప‌టి క‌థానాయిక‌ల్లో స‌క్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోయిన్‌ ఎవ‌రంటే… నిస్సంకోచంగా వినిపించే పేరు అందాల తార‌ స‌మంత‌నే. `ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ఈజ్ బెస్ట్ ఇంప్రెష‌న్` అంటారు… అలా తొలి అడుగులోనే ఎంతో ఇంప్రెస్ చేసి మ‌రీ విజయాన్ని అందుకున్న ఈ చెన్నై బ్యూటీ… ఆ త‌రువాత వెన‌క్కు తిరిగి చూసే ప‌రిస్థితి రాలేదు. ఒక‌టి కాదు… రెండు కాదు… ఏకంగా తొమ్మిదేళ్ళుగా వెండితెర‌పై అందాల సామ్ చేస్తున్న `మాయ‌`కి ముగ్థులై ఇంకా ఆ మైమ‌ర‌పులోనే ఉన్నారు ఆమె అభిమానులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన త‌మిళ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ రూపొందించిన `ఏమాయ చేసావె`(2010)తో ప‌రిచ‌య‌మైన సామ్‌… మొద‌టి సినిమాతోనే యాక్ట్ర‌స్‌గా డిస్టింక్ష‌న్ మార్కులు కొట్టేసింది. ఏయ‌న్నార్ లాంటి మ‌హాన‌టుడి ప్ర‌శంస‌ల‌ను ద‌క్కించుకుంది. ఆ త‌రువాత సినిమా సినిమాకి న‌టిగా ఎదుగుతూ… గ్లామ‌ర్‌, పెర్‌ఫెర్మాన్స్ రెండింటిని బ్యాల‌న్స్ చేస్తూ… అన‌తికాలంలోనే అగ్ర‌తార అనిపించుకుంది.

అంతేకాదు… త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌ని ప్రేమించి… పెళ్ళి చేసుకుంది. పెళ్ళ‌యినా… వ‌రుస విజ‌యాలు సాధిస్తూ తిరుగులేని ఫామ్‌తో దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే త‌న భ‌ర్త‌తో క‌ల‌సి `మ‌జిలీ`తో ప‌ల‌క‌రించ‌నున్న స‌మంతకి ఈ రోజు ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే… ఆమె తొలి చిత్రం `ఏమాయ చేసావె` విడుద‌లై నేటికి స‌రిగ్గా తొమ్మిదేళ్ళు పూర్త‌వుతున్నాయి. ఈ సంద‌ర్భంగా… మున్ముందు మ‌రిన్ని విజ‌యాల‌తో ఈ అక్కినేని వారింటి కోడ‌లు వెండితెర‌పై ఇంకా వెలుగులు పంచాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

[youtube_video videoid=x6hiXLBGmmo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 2 =