కౌషల్ పై కౌషల్ ఆర్మీ ఫైర్

Kaushal Army Fires on Kaushal,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Kaushal Army Speaks About Kaushal,Kaushal Fans Reaction on Kaushal,Bigg Boss Season 2 Winner Kaushal Latest News,Kaushal Latest News,Kaushal Army Against to Kaushal
Kaushal Army Fires on Kaushal

బిగ్ బాస్2.. బిగ్ బాస్ 1 ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు పోయిందో ఎవరికి కూడా తెలియదు కానీ.. బిగ్ బాస్2 మాత్రం ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. అంతలా ఈ సీజన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీనికి కారణం మనందరికీ తెలిసిందేక. కౌషల్ మండా. మొదటి రెండు వారాలు బిగ్ బాస్ సీజన్ 2 ను పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు ఆ గేమ్ షాలో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అయిన కిరిటీ కెప్టన్ టాస్క్ లో కౌషల్ పై కాస్త అతిగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా గేమ్ మారిపోయింది. ఆ రోజు నుండి గేమ్ పైనా… ముఖ్యంగా కౌషల్ పైన ప్రేక్షకులు కాన్సన్ ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేనా కౌషల్ ను ఏదన్నా అంటే తమ ఇంట్లో వాళ్లనే అన్నంత ఫీల్ అయిపోయేవారు ఫ్యాన్స్. అతని కోసం ఒక ఆర్మీ కూడా తయారైంది. ఈ ఆర్మీ కౌశల్ ని ఎవరైనా హౌస్ లో ఒక్క మాట అన్నా, గొడవ పడినా వాళ్లను ఎలిమినేట్ చేసేవరకు నిద్రపోయేవారు కాదు. ఇక యాంటి కౌషల్ ఫ్యాన్స్ వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం.. దీని మీద పలు టీవీ ఛానళ్ళలో డిబేట్లు పెట్టడం అబ్బో అప్పట్లో ఎక్కడ చూసినా ఇదే హడావుడి.

అయితే ఉన్నట్టుండి ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ…అంతలా అభిమానించి.. అంతలా ప్రేమించిన ఫ్యాన్స్ ఒక్కసారిగా కౌశల్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కౌశల్ కి డబ్బు పిచ్చి అంటూ కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాదు కౌషల్ పై పలు ఆరోపణలే గుప్పించారు.

కౌశ‌ల్ ఆర్మీని కౌశ‌ల్ సెంటిమెంట‌ల్ ఫూల్స్ చేసి ఆడుకున్నాడు. తాను బిగ్ బాస్ 2లో విజేత అయిన త‌ర‌వాత‌.. కౌశ‌ల్ ఆర్మీని గానీ, త‌న‌కు స‌పోర్ట్ చేసిన‌వాళ్ల‌ని గానీ కౌశ‌ల్ ప‌ట్టించుకోలేదు. డబ్బు లేకపోతే ఫ్యాన్స్ ని కూడా పట్టించుకోడని, కౌశల్ ఎక్కడికి వెళ్లినా కౌశల్ ఆర్మీ ఖర్చు భరించాల్సి వచ్చేదని, ఫ్యాన్స్ తమ డబ్బులతో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేవారని అతడు చెప్పడం షాక్ కి గురి చేసింది. అంతేకాదు… బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుని ఫౌండేషన్ కి ఉపయోగిస్తానని చెప్పిన మాటల్లో కూడా నిజం లేదని .. మేం అడిగితే… మా టీవీ వాళ్లు ఇంకా ఇవ్వ‌లేద‌ని చెబుతున్నాడు. మ‌రీ గ‌ట్టిగా అడిగితే.. `మీకెందుకు? నా డ‌బ్బులు నా ఇష్టం అంటున్నాడని అన్నారు. తనకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సింపతీ క్రియేట్ చేస్తూ మానిప్యులేట్ చేస్తుంటాడని.. కౌశల్ లాంటి వ్యక్తి సొసైటీ కి చాలా డేంజర్ అని సంచలన కామెంట్స్ చేశారు. కౌశ‌ల్ ఆర్మీ నిజాయితీగా కౌశ‌ల్ కోసం ప‌ని చేసింది. అయితే కౌశ‌ల్ కి మ‌రో పెయిడ్ ఆర్మీ కూడా ఉంది. వీళ్ల ప‌నేంటంటే.. కౌశ‌ల్ కోసం ఎవ‌రైనా నెగిటీవ్‌గా మాట్లాడితే వాళ్ల‌ని ట్రోల్ చేయ‌డం. ఫోన్లు చేసి బెదిరించ‌డమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరి ఒకప్పుడు కౌషల్ ను ఏదైనా అంటే అతని తరపున బయట వాకాల్తా పుచ్చుకొని ఆకాశానికి ఎత్తేసిన ఫ్యాన్స్..ఇప్పుడు అదే కౌషల్ ను అథః పాతాళంలోకి పడేశారు. మరి ఇందులో ఎంత నిజముందో..?దీనిపై కౌషల్ ఎలా స్పందిస్తాడో.. ?ఎలా సమాధానం చెబుతాడో చూడాలి?

[subscribe]

[youtube_video videoid=_BphyZovUfo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − three =