సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. భారీ బడ్జెట్ తో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో షేడ్స్ ఆఫ్ చాప్టర్ 1 అంటూ ఇటీవల ఓ వీడియోను విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2 అంటూ మరో వీడియో ను విడుదల చేయనున్నారు. మార్చి 3వ తేదీన శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా చాప్టర్ 2ను విడుదలచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ గా వేసిన ఓ సెట్‌లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇదే లాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ గా తెలుస్తోంది. ఇక దీని తరువాత పాటలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తవుతుందని.. దాంతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవతుందని టాక్. ఇక ఆ తరువాత అన్ని పనులు త్వరలో పూర్తి చేసి జూలై నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇంకా ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 15వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో `సా హో` విడుదలచేయనున్నారు. మరి `బాహుబలి` సిరీస్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ చిత్రం ఆ అంచనాలకు అందుకుంటుందో?లేదో? చూద్దాం.
[youtube_video videoid=huw6wD_1ppE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: