నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం `జెర్సీ`, శర్వానంద్ పేరు నిర్ణయించని అప్‌కమింగ్ ప్రాజెక్ట్ (సుధీర్ వర్మ దర్శకుడు)… వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య నెలకి పైగా గ్యాప్ ఉండనుంది. అయితే… ఈ ఇద్దరి తదుపరి చిత్రాలు మాత్రం ఒకే రోజున విడుదలయ్యే అవకాశముందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `జెర్సీ` తరువాత నాని నటిస్తున్న`గ్యాంగ్ లీడర్` ఆగస్టులో రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం… `సాహో` విడుదలైన రెండు వారాల తరువాత అంటే… ఆగస్టు 29న `గ్యాంగ్ లీడర్` తెరపైకి వచ్చే అవకాశముందని తెలిసింది. కట్ చేస్తే… సరిగ్గా అదే రోజున శర్వానంద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అయిన `96` రీమేక్ కూడా విడుదలయ్యే అవకాశముందని ఫిల్మ్‌నగర్ వర్గాల ఇన్‌ఫర్‌మేషన్. అంటే… ఒకే రోజున నాని, శర్వానంద్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశముందన్నమాట. మరి… ఈ ఇద్దరూ అదే రోజున వస్తారా లేదంటే గ్యాప్ తీసుకుంటారా అన్నది ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
[youtube_video videoid=uf0qH2M9fG0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: