అల్లు అర్జున్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి…?

Thaman To Work With Allu Arjun for Third Time,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Allu Arjun New Movie Music Director,Stylish Star Allu Arjun and Thaman Combination Again,Thaman and Allu Arjun To Repeat Their Combination,Allu Arjun Upcoming Film Music Director,Allu Arjun New Movie Updates
Thaman To Work With Allu Arjun for Third Time

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల‌లో యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్‌ ఒక‌రు. బ‌న్నీ, త‌మ‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `రేసుగుర్రం`, `స‌రైనోడు` మ్యూజిక‌ల్‌గా మెప్పించ‌డ‌మే కాదు… బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేశాయి. అలాంటి… ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌రో సినిమా రాబోతోంద‌ని టాలీవుడ్ టాక్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, బ‌న్నీ క‌ల‌యిక‌లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి స్వ‌ర‌క‌ర్త‌గా త‌మ‌న్ ఎంపిక‌య్యాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. త్రివిక్ర‌మ్ గ‌త చిత్రం `అర‌వింద స‌మేత‌`కి త‌మ‌న్ అందించిన బాణీలు, నేప‌థ్య సంగీతం… స‌ద‌రు యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి అద‌నపు బ‌లంగా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో… బ‌న్నీతో చేయ‌బోయే సినిమాకి కూడా త‌మ‌న్‌నే మ్యూజిక్ కంపోజ‌ర్‌గా ఎంచుకున్నాడ‌ట త్రివిక్ర‌మ్‌. త్వ‌ర‌లోనే త‌మ‌న్ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌చ్చు.

గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుందని స‌మాచారం. మ‌రి… అటు త్రివిక్ర‌మ్‌తోనూ, ఇటు త‌మ‌న్‌తోనూ బ‌న్నీ హ్యాట్రిక్ కొడ‌తాడేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=o1cPWuceEJg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + five =