‘వినాయకుడు’ ఫేమ్ అడివి సాయి కిరణ్ దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కమాండో అర్జున్ పండిట్ పాత్రలో నటిస్తున్న ఆది లుక్ న ఇటీవలే ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా.. ఈసారి ఓ మంచి కాన్సెప్ట్ తో ఆది వస్తున్నాడన్నా అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన అబ్బూరి రవి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నార. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదగా రేపు అబ్బూరి రవి ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ఎయిర్‌టెల్ అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా పాపులర్ అయిన సాషా ఛెత్రి తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇంకా ఈ సినిమాలో కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై ప్రతిభ అడివి, కట్ట ఆశీష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బీహెచ్, సతీశ్ డేగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మరి ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో నటించినా ఆది ఇప్పటివరకూ సరైస సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి ఎలాగైనా కమర్షియల్‌గా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు. అందుకే యాక్షన్‌ను ప్రాధాన్యత ఉన్న కథను ఎంచుకున్నాడు. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ ఇస్తుందో చూద్దాం.
[youtube_video videoid=YorrwXf0mfI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: