బాబి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ లో వెంకీ మామ అనే మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రెండు రోజుల క్రితమే ప్రారంభించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా షూటింగ్ తాజా అప్ డేట్ ఏంటంటే… ప్రస్తుతం గోదావరి నది ఒడ్డున షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో చైతు ఇంట్రడక్షన్ సీన్ ను తీస్తున్నాడట. వెంకటేష్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. విలేజ్ లోకి చైతుకి వెంకటేష్ వెల్ కమ్ చెప్పే సన్నివేశం చిత్రీకరిస్తున్నారట. మరి చూడబోతే ఎఫ్2తో సందడి చేసిన వెంకీ.. అల్లుడు తో కలిసి మరోసారి సందడి చేసేలా కనిపిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మొన్నటి వరకూ కన్ఫ్యూజన్ లో ఉన్న హీరోయిన్ల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు ఇటీవలే చిత్రయూనిట్. పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా ఈ సినిమాలో ఫిక్స్ అయినట్టు సురేష్ ప్రొడక్షన్స్ వారు క్లారిటీ ఇచ్చేశారు. కాగా ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. సురేష్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. మరి చూద్దాం మామఅల్లుళ్ళు బాక్సాఫీస్ వద్ద ఎంత హడావుడి చేస్తారో?
[youtube_video videoid=N6vxER5O9Bk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: