పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్లను అధికారికంగా ప్రకటించారు. ఒక హీరోయిన్ నిథి అగర్వాల్ ను ఎంపిక చేయగా.. మరో హీరోయిన్ నభానటేష్ ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ ది ఫుల్ మాస్, తెలంగాణ యాస మాట్లాడే కారెక్టర్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త వినిపిస్తుంది. ఒక పక్క షూటింగ్ జరుగుతుండగానే.. ఈ సినిమా సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు..పూరీ జగన్నాథ్, ఛార్మీ ఈ సీక్వెల్ కు డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ను కూడా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. మరి చూద్దాం దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తారేమో..
కాగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. ఈ ఏడాది ‘మే’లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
[youtube_video videoid=sv-YLoucBM8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: