
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 136


పుష్ప 2 సోలో రిలీజ్

ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ లాక్

రత్నం ట్రైలర్ రిలీజ్

తేజ సజ్జ కొత్త సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఘనంగా జరిగిన శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం

డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ చరణ్

జెర్సీ స్పెషల్ షోస్ అప్ డేట్

పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మనోజ్ దంపతులు

మనమే టీజర్ అప్ డేట్ అడుగుతున్న కృతిశెట్టి
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే శర్వాకి కూడా సాలిడ్ హిట్ పడి చాలా కాలమవుతుంది. దీంతో ఒక సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం శర్వా నుండి మరొక సినిమా వస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా నంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టినా టైటిల్ ను మాత్రం ఇటీవలే ప్రకటించారు. ఇక గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఇక నా మాటే అనే పాటను రిలీజ్ చేశారు. పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

పుష్ప 2 సోలో రిలీజ్
పుష్ప 2 హైప్ ఏ రేంజ్ లో ఉందో రీసెంట్ గా రిలీజైనా టీజర్ కు వచ్చిన వ్యూస్ చూస్తూనే అర్ధమవుతుంది.ఒక్క తెలుగులోనే కాదు నార్త్ లోకూడా భారీ అంచనాలు వున్నాయి. పుష్ప ఫస్ట్ పార్ట్ అక్కడ 100కోట్లు రాబట్టింది.ఇక పుష్ప 2కు తెలుగులో సోలో రిలీజ్ డేట్ దొరికింది. ఆగస్టు 15న వస్తున్నామని మేకర్స్ పదే పదే చెప్తున్నారు. దాంతో ఈ సినిమా తోపోటీపడడానికి ఏ ఒక్క సినిమా కూడా ముందుకు రావడం లేదు. సౌత్ అంత దాదాపు సోలోగానే రిలీజ్ కానుంది ఒక్క కన్నడ లో ఏమైనా పోటీ ఉంటే ఉండొచ్చు.

ఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ లాక్
రీసెంట్ గా నా సామి రంగలో కీలక పాత్రలో కనిపించి హిట్ కొట్టాడు అల్లరి నరేష్.ఇక ఇప్పుడు సోలో హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో. తాజాగా మేకర్స్ ఈసినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు.నిజానికి మార్చి లోనే ఈసినిమా విడుదలకావాల్సి ఉండగా వాయిదావేశారు.ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ చెప్పేశారు.మే 3న ఈసినిమా థియేటర్లలోకి రానుందని వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.అల్లరి నరేష్ స్ట్రాంగ్ జోన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వస్తుంది ఈసినిమా.

రత్నం ట్రైలర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా…

తేజ సజ్జ కొత్త సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకటి రెండు సినిమాలకే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ ను కొట్టడం అంటే మాములు విషయం కాదు. కానీ సరైనా సినిమా పడితే అది సాధ్యమే అని నిరూపించాడు కుర్ర హీరో తేజ సజ్జ. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు తేజ సజ్జ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు ఏకంగా దేశవ్యాప్తంగా పేరును సొంతం చేసుకున్నాడు. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా సందడి చేస్తుంది.

ఘనంగా జరిగిన శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం
శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయతో ఐశ్వర్య నిశ్చితార్థం జరిగిన సంగతి తెలసిందే కదా. తరుణ్ కార్తికేయ దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తరుణ్ కార్తికేయన్ కేవలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా పాటల రచయితగానూ, అలాగే ప్లే బ్యాక్ సింగర్‌గా కూడా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

విజయ్ ది గోట్ నుండి సాంగ్ రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) నుండి నిన్న మొదటి పాటను రిలీజ్ చేశారు. విజిల్ పోడు అంటూ సాగే ఈసాంగ్ ను విజయ్ పాడాడు.లిరికల్ వీడియో లో విజయ్ తోపాటు ప్రభుదేవా,ప్రశాంత్ కూడా కనిపించారు.ఈ సాంగ్ కూడా క్యాచీ గా వుంది.ఈసాంగ్ కు రాజు సుందరం కొరియోగ్రఫీ చేశాడు.ప్రస్తుతం విజిల్ పోడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక విజయ్ సినిమాల నుండి వచ్చే సాంగ్స్ కూడా రికార్డులు సృష్టించడం కామన్.మరి ఈ విజిల్ పోడు ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

కంగువ నుండి రెండు డిఫరెంట్ లుక్స్ తో ఇంట్రెస్టింగ్ పోస్టర్
స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

ఇండియన్ 2- ఫుల్ స్వింగ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు
ఇండియన్ సినీ రంగంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి చెప్పాలంటే కమర్షియల్‌గా భారీ చిత్రాలను అద్భుతం అని అందరూ మెచ్చుకునేలా తెరకెక్కించటంలో సుప్రసిద్ధుడు. ఆయన సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్దరూ చేతులు కలిపారంటే అద్భుతమైన సినిమా మన ముందుకు వస్తుందనటంలో సందేహం లేదు. భారతీయుడు సినిమాతో అది నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ‘భారతీయుడు 2’తో సిల్వర్ స్క్రీన్‌పై మాయ చేయబోతున్నారు…

పుష్ప2 టీజర్- సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న టీజర్
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప-2 ది రూల్. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప ఫస్ట పార్ట్ సంచలన విజయం సాధించడమే. ఫస్ట్ పార్ట్ తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈసినిమాలో ఐకాన్‌స్టార్ నటనకు, డైరెక్టర్ సుకుమార్ మేకింగ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

జితేందర్ రెడ్డి మూవీ నుండి యూత్ ఫుల్ అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ రిలీజ్
ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె హీరోగా వస్తున్న సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై అంచనాలను పెంచేసాయి.

డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆతర్వాత కూడా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ స్టార్ హీరో అయ్యాడు. ఇక రంగస్థలంతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఆసినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ స్థాయిలో రామ్ చరణ్ క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఇక్కడ మాత్రమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సైతం అందుకున్నాడు.

జెర్సీ స్పెషల్ షోస్ అప్ డేట్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సినిమా జెర్సీ. కామెడీతో ఎలా అయితే నవ్వించగలడో ఎమోషనల్ కథలతో కూడా ప్రేక్షకులను ఏడిపించగలడు నాని. ఆ విషయం మరోసారి జెర్సీ సినిమాతో నిరూపించాడు. ఈసినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు నాని. అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. అందుకే ఈసినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడమే కాదు.. నేషనల్ అవార్డులు సైతం దక్కించుకుంది.

ఫ్యామిలీ స్టార్- యూఎస్ఏ మ్యాజికల్ కలెక్షన్స్
పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు.

పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మనోజ్ దంపతులు
మంచు వారి ఇంట ఆనందం నెలకొంది. మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తండ్రిగా కూడా ప్రమోట్ అయ్యాడు. మంచు మనోజ్ భార్య భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పుడు వారు నలుగురు అయ్యారు.. దేవుళ్ల ఆశీర్వాదంతో దేవత వచ్చింది. మనోజ్, మౌనిక ఎంతగానో ఎదురుచూస్తున్న బేబి గార్ల్ ను పొందారని అనౌన్స్ చేయడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది.. అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధుల్లేవు. ఆమెను మేము ముద్దుగా ఎంఎం పులి అని పిలస్తున్నాము అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

ప్రతినిధి 2- ప్రముఖ సంస్థకు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్
చాలా గ్యాప్ తరువాత నారా రోహిత్ ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2014లో నారా రోహిత్ హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతినిధి ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు సీక్వెల్ తో వస్తున్నారు. దీంతో ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి.

భీమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ ఎప్పటినుండో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనో ఇటీవలే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా భీమా. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈసినిమా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

డియర్ మూవీ ఓటీటీ పార్టనర్ లాక్
ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన సినిమా డియర్. ఈసినిమా నిన్ననే థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా గురక కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈసినిమా అలా థియేటర్లలో రిలీజ్ అయిందో?లేదో? అప్పుడే ఓటీటీ పార్టనర్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషయల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఓం భీమ్ బుష్
గత ఏడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసిన ప్రేమలు మూవీ
గిరీష్ దర్శకత్వంలో మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రేమలు. మలయాళంలో వచ్చిన ప్రేమలు సినిమా అక్కడ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. దాదాపు 135కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈసినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.