స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను, టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు తాజాాగా ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు డిఫరెంట్ లుక్స్ తో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. సూర్య యోధుడు గా కనిపించిన పాత్రతో పాటుగా, స్టైలిష్ గా చేతిలో గన్ పట్టుకొని ఉన్న మరో ఇంట్రెస్టింగ్ రోల్ గెటప్ ను రివీల్ చేశారు.
Where the past and present collide, a new future begins 🗡️#Kanguva 🦅 Releasing 2024 in cinemas worldwide. #HappyTamilNewYear✨@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP @StudioGreen2 @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @PenMovies #PenMarudhar… pic.twitter.com/yBwMMniMOM
— UV Creations (@UV_Creations) April 14, 2024
కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: