తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) నుండి నిన్న మొదటి పాటను రిలీజ్ చేశారు. విజిల్ పోడు అంటూ సాగే ఈసాంగ్ ను విజయ్ పాడాడు.లిరికల్ వీడియో లో విజయ్ తోపాటు ప్రభుదేవా,ప్రశాంత్ కూడా కనిపించారు.ఈ సాంగ్ కూడా క్యాచీ గా వుంది.ఈసాంగ్ కు రాజు సుందరం కొరియోగ్రఫీ చేశాడు.ప్రస్తుతం విజిల్ పోడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక విజయ్ సినిమాల నుండి వచ్చే సాంగ్స్ కూడా రికార్డులు సృష్టించడం కామన్.మరి ఈ విజిల్ పోడు ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రష్యాలో జరుగుతుంది.ఈషెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.వెంకట్ ప్రభు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సీనియర్ హీరో ప్రశాంత్ ,లైలా ,మీనాక్షి చౌదరీ,యోగిబాబు వీటీవీ గణేష్,జయరామ్ ,స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.ఈ సినిమాను సెప్టెంబర్ 5న థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఇక ఈసినిమా తరువాత విజయ్ మరో సినిమా మాత్రమే చేయనున్నాడు.ఆతరువాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లో బిజీ కానున్నాడు.తన చివరి సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: