ఘనంగా జరిగిన శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం

shankar daughters aishwarya marriage with tarun karthikeyan

శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్ కార్తికేయతో ఐశ్వర్య నిశ్చితార్థం జరిగిన సంగతి తెలసిందే కదా. తరుణ్ కార్తికేయ దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తరుణ్‌ కార్తికేయన్‌ కేవలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా పాటల రచయితగానూ, అలాగే ప్లే బ్యాక్‌ సింగర్‌గా కూడా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఐశ్వర్య-తరుణ్‌ కార్తీక్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నేడు చెన్నైలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహానికి సినీ ప్రముఖులు కూడా హాజరైనట్టు తెలుస్తుంది. రజినీకాంత్‌, కమల్‌ హాసన్, విక్రమ్‌, నయన్‌-విఘ్నేశ్ శివన్‌, సూర్య, కార్తీ తో పాటు పలువురు హాజరయ్యారు. ఇక ఐశ్వర్యా వివాహానికి సంబంధించిన ఫొటోలను సోదరి అదితి తన ఇన్‌ స్ట్రాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ప్రస్తుతం గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ సినిమా వస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇండియన్ 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. జూన్ లో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 15 =