టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ ఎప్పటినుండో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనో ఇటీవలే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా భీమా. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈసినిమా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి రావడానికి సిద్దమైంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 25వ తేదీన స్ట్రీమింగ్ కు రానుంది.
From the History pages to your screens! Time for #Bhimaa‘s MASSSS journey 🤯😤
Watch the Trailer Now – https://t.co/OrkJdAVsY0#BhimaaonHotstar Streaming from April 25th! @YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur @disneyplushstel pic.twitter.com/F4SzjUsBpF
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 13, 2024
కాగా ఈసినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: