జెర్సీ స్పెషల్ షోస్ అప్ డేట్

nani jersey movie special shows update

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సినిమా జెర్సీ. కామెడీతో ఎలా అయితే నవ్వించగలడో ఎమోషనల్ కథలతో కూడా ప్రేక్షకులను ఏడిపించగలడు నాని. ఆ విషయం మరోసారి జెర్సీ సినిమాతో నిరూపించాడు. ఈసినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు నాని. అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. అందుకే ఈసినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడమే కాదు.. నేషనల్ అవార్డులు సైతం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా మేకర్స్ ఇప్పుడు తాజాగా ఓ అప్ డేట్ తో వచ్చాడు. ఏప్రిల్ 20వ తేదీకి ఈసినిమా రిలీజ్ అయి ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో ఈరోజున ఈసినిమా స్పెషల్ షోస్ ను నిర్వహించనున్నట్టు అధికారికంగా తెలియచేశారు.

కాగా ఈసినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించగా.. అనిరుథ్ సంగీతం అందించాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seventeen =