తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Presenting the blasting action trailer of #Rathnam 🔥 in theatres on APRIL 26TH!
Tamil – https://t.co/ICmgSPHpX7
Telugu – https://t.co/MvPYH6RQc2
Starring Puratchi Thalapathy @VishalKOfficial.
A film by #Hari.
A @ThisisDSP musical. @stonebenchers @ZeeStudiosSouth… pic.twitter.com/opKDvARDlR— Stone Bench (@stonebenchers) April 15, 2024
కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియా భవానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఇంకా సముద్రఖని, గౌతమ్ మీనన్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను జీ స్టూడియోస్ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: