మనమే టీజర్ అప్ డేట్ అడుగుతున్న కృతిశెట్టి

krithi shetty interesting post on sharwanand manamey movie teaser

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే శర్వాకి కూడా సాలిడ్ హిట్ పడి చాలా కాలమవుతుంది. దీంతో ఒక సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం శర్వా నుండి మరొక సినిమా వస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా నంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టినా టైటిల్ ను మాత్రం ఇటీవలే ప్రకటించారు. ఇక గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఇక నా మాటే అనే పాటను రిలీజ్ చేశారు. పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో హీరోయిన్ కృతి శెట్టి తన ట్విట్టర్ ద్వారా మనమే టీజర్ గురించి ఒక ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అన్నీ శర్వానంద్ అప్ డేట్లే వచ్చాయి.. ఇంతకీ మనమే టీజర్ ఎప్పుడు డైరెక్టర్ గారు అంటూ ఉంది. మరి టీజర్ పై త్వరలోనే అప్ డేట్ వస్తుందేమో చూద్దాం..

కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =