రీసెంట్ గా నా సామి రంగలో కీలక పాత్రలో కనిపించి హిట్ కొట్టాడు అల్లరి నరేష్.ఇక ఇప్పుడు సోలో హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో. తాజాగా మేకర్స్ ఈసినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు.నిజానికి మార్చి లోనే ఈసినిమా విడుదలకావాల్సి ఉండగా వాయిదావేశారు.ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ చెప్పేశారు.మే 3న ఈసినిమా థియేటర్లలోకి రానుందని వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.అల్లరి నరేష్ స్ట్రాంగ్ జోన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా వస్తుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది.కామెడీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యేలానే వుంది.పెళ్లి కోసం హీరో పడే కష్టాలను కామెడీ గా చూపించనున్నారు.కంటెంట్ కూడా ఇప్పుడున్న యూత్ కు సరిపోయేది కావడంతో సినిమా విజయంపై టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.
మరి ఈసినిమాతో అల్లరి నరేష్ మరో బ్లాక్ బాస్టర్ కొడతాడో లేదో చూడాలి.మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈసినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు.రాజీవ్ చిలక ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: