
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 135


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రానుంది

తంగలాన్- విక్రమ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

దసరాను దాటేసిన టిల్లు స్క్వేర్

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

రజినీకాంత్ బాషా రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?

ఆ వార్తల్లో నిజం లేదు - నాగవంశీ

సెన్సార్ పూర్తిచేసుకున్న విశాల్ రత్నం

తండేల్ షూటింగ్ పై లేటెస్ట్ అప్ డేట్

అమెరికాలో దుమ్ము రేపుతున్న టిల్లు స్క్వేర్

థగ్ లైఫ్- మళ్లీ వచ్చిన స్టార్ హీరోలు

హరిహర వీరమల్లు.. టీజర్ రిలీజ్ అప్‌డేట్

లవ్ మౌళి రిలీజ్ డేట్ వాయిదా

తండేల్ రిలీజ్ డేట్ ఫిక్స్
అక్కినేని వారసత్వంలో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఇక తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పటివరకూ బాగానే హిట్లను అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రానుంది
విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరికి సాంగ్స్ ద్వారా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా ఆ రెండు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఇప్పుడు టీజర్ కూడా రానుంది.అతి త్వరలో ఈ టీజర్ విడుదల కానుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.టీజర్ కట్ సినిమా బిజినెస్ కు కీలకం కానుంది.

తంగలాన్- విక్రమ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
ప్రముఖ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

దసరాను దాటేసిన టిల్లు స్క్వేర్
గుంటూరు కారం,హనుమాన్ తరువాత ఈ ఏడాది 100కోట్ల క్లబ్ లో చేరింది టిల్లు స్క్వేర్.బ్లాక్ బాస్టర్ డీజే టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సూపర్ మౌత్ టాక్ తో అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 125కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో నాని దసరా సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ను దాటేసింది.గత ఏడాది సమ్మర్ లో విడుదలైన దసరా 120కోట్లు రాబట్టి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఆ కలెక్షన్స్ ను దాటేసింది.

రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

రజినీకాంత్ బాషా రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్‌లో గతకొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం మూవీ లవర్స్‌కి తెలిసిన విషయమే. అగ్ర హీరోలు నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నయా ట్రెండ్ నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతో నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అలాగే మరోవైపు ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలు సూపర్ హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదిలావుండగా.. తాజాగా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి తమిళ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన మూవీ ఒకటి చేరింది.

ఆ వార్తల్లో నిజం లేదు - నాగవంశీ
గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో దేవర థియేట్రికల్ రైట్స్ గురించి చర్చ జరుగుతుంది.ఈసినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ 120కోట్లకు దక్కించుకుందని వార్తలు వచ్చాయి.కొందరు అయితే ఏకంగా పోస్టర్ ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు.ఇక ఈ న్యూస్,పోస్టర్ లు సితార అధినేత నాగవంశీ కంటపడడంతో తాజాగా అయన క్లారిటీ ఇచ్చారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న విశాల్ రత్నం
యాక్షన్ హీరో విశాల్ నుండి రాబోతున్న సినిమా రత్నం. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈసినిమా ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు.

తండేల్ షూటింగ్ పై లేటెస్ట్ అప్ డేట్
నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

అమెరికాలో దుమ్ము రేపుతున్న టిల్లు స్క్వేర్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

ప్రతినిధి 2- ఫస్ట్ సింగిల్ గల్లా ఎత్తి సాంగ్ రిలీజ్
బాణం, సోలో, ప్రతినిధి, అసుర వంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు రోహిత్. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే ఆకట్టుకుంది.

థగ్ లైఫ్- మళ్లీ వచ్చిన స్టార్ హీరోలు
లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

హరిహర వీరమల్లు.. టీజర్ రిలీజ్ అప్‌డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' తదితర సినిమాల్లో కథానాయకుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలతో పాటుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాగా ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు కావడం, వీటిని మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాలపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

విజిల్ పోడు సాంగ్ కు రికార్డు వ్యూస్
దళపతి విజయ్ సినిమాలనుండి వస్తున్న సాంగ్స్ కు క్రేజ్ అంతా ఇంతా కాదు.రీసెంట్ గా లియో నుండి వచ్చిన నా రెడీ అలాగే వారిసు లోని రంజితమే అలాగే బీస్ట్ నుండి వచ్చిన అరబిక్ కుతు యూట్యూబ్ లో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టి సెన్సేషన్ సృష్టించాయి.ఇందులో అరబిక్ కుతు 24 గంటల్లో 23.77 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి సౌత్ ఇండియాలో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి సాంగ్ గా రికార్డు సృష్టించింది.అయితే ఇప్పుడు ఈ రికార్డు ను బ్రేక్ చేసింది విజిల్ పోడు సాంగ్.ఇక ఈసాంగ్ కూడా విజయ్ నటిస్తున్న సినిమాలోనేదే.విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతున్న 'మంజుమ్మల్ బాయ్స్'
మలయాళ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ అదే టైటిల్ తో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. పరవ ఫిలింస్ పతాకంపై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. షైజు ఖలీద్ డీవోపీ కాగా, సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు. వివేక్ హర్షన్ ఎడిటర్‌గా.. అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు.

ఓటీటీలో గామి బ్రేకింగ్ రికార్డ్స్
విధ్యాధర కాగిట దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా గామి. మొదటిసారి విశ్వక్ కెరీర్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది ఈసినిమా. ఈసినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది.

కన్నప్ప- హైద్రాబాద్ లో ల్యాండ్ అయిన అక్షయ్ కుమార్
విష్ణు మంచు నుండి రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప. శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా ఎక్కువ షూటింగ్ న్యూజిలాండ్ లోనే జరుపుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న టిల్లు స్క్వేర్
టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. గతంలో ఆయన హీరోగా వచ్చిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‍గా రూపొందిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అలాగే హారో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్వయంగా కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించగా.. మురళీధర్, ఆంథోనీ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు.. ఎంట్రీ ఇచ్చినా తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కాదు అంత ఈజీ కాదు. కానీ ఏదో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు సంయుక్త శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

లవ్ మౌళి రిలీజ్ డేట్ వాయిదా
అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈసినిమాలో నవదీప్ఇంతకుముందు ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.