ఇండియన్ సినీ రంగంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి చెప్పాలంటే కమర్షియల్‌గా భారీ చిత్రాలను అద్భుతం అని అందరూ మెచ్చుకునేలా తెరకెక్కించటంలో సుప్రసిద్ధుడు. ఆయన సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్దరూ చేతులు కలిపారంటే అద్భుతమైన సినిమా మన ముందుకు వస్తుందనటంలో సందేహం లేదు. భారతీయుడు సినిమాతో అది నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ‘భారతీయుడు 2’తో సిల్వర్ స్క్రీన్‌పై మాయ చేయబోతున్నారు. భారతీయుడు బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేనాపతిగా ‘భారతీయుడు’ చిత్రంలో కమల్ హాసన్ తిరుగులేని విజయాన్ని సాధించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రానుండటంతో మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. గ్రిప్పింగ్ కథనంతో ఈ మూవీ మరింతగా ప్రేక్షకులను మెప్పించనుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు సహా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘భారతీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. దానికి అనుగుణంగానే ప్రమోషనల్ ప్లానింగ్‌తో సినిమాపై అంచనాలను పెంచుతూ వస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసిన శంకర్ ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేయటంపై దృష్టి సారించారు. మే నెలాఖరున పవర్‌ప్యాక్డ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. జూన్‌లో భారీ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: