ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె హీరోగా వస్తున్న సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై అంచనాలను పెంచేసాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి అ ఆ ఇ ఈ ఉ ఊ అంటూ సాగే యూత్ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆర్ట్స్ సైన్స్ ఇంగ్లీష్ కంటే ముందు ఎన్నో విషయాలు జరిగాయి అవి తెలుసుకోవాలి. ఐన్స్టీన్, న్యూటన్ ఏ కాదు మనదేశంలో కూడా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటూ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ గా ఈ సాంగ్ ని తెరకెక్కించారు. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు రాహుల్ సిప్లిగంజ్ పాటని పాడారు. కాలేజీలో జరిగే ఎలక్షన్స్ గ్యాంగ్స్ మధ్య ఉండే రైవలరీస్ ఈ లిరికల్ సాంగ్ లో చూపించారు.
Relive your college memories with the catchy #AAaEEeUUu lyrical song from the #JithenderReddy movie, out now on @adityamusic.
Directed by 🎬 @virinchivarma
In cinemas #JithenderReddyOnMay3rd 🔥@rakesh_varre @GopiSundarOffl @gnanashekarvs… pic.twitter.com/wg53Oqgt3Q
— Aditya Music (@adityamusic) April 13, 2024
కాగా ఈసినిమా లో వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఎస్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: