పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా యూఎస్ఏ లో మాత్రం సూపర్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. అక్కడ రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూనే వెళుతుంది. తాజాగా ఈసినిమా 850 కే డాలర్లను సొంతం చేసుకుంది. ఎలాగూ వీకెండ్ వచ్చేసింది.. ఈ రెండు రోజులు ఈసినిమా కలెక్షన్స్ పెంచుకోవడానికి మంచి అవకాశం. దీంతో త్వరలోనే ఈసినిమా 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరే అవకాశం కనిపిస్తుంది.
The magic of #TheFamilyStar knows no bounds! The USA gross is at $850K+, and it’s clear that families across the USA can’t get enough of this enchanting film! 😍🥳
Overseas by @sarigamacinemas #VijayDeveraKonda #MrunalThakur @SVC_official pic.twitter.com/3cM9PcFthq
— Sarigama Cinemas (@sarigamacinemas) April 12, 2024
కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చింది. ఈ సినిమాలో గోవర్ధన్ అనే మిడిల్ క్లాస్ యువకుడిగా విజయ్ దేవరకొండ కనిపించాడు. అతని జీవితంలోకి ఇందు ఎలా వచ్చింది? ఇందును ప్రేమించిన గోవర్ధన్ ఆమెకు ఎందుకు బ్రేకప్ చెప్పాడు? జాబ్ కోసం గోవర్ధన్ అమెరికా వెళ్లగా అతడి వెంట ఇందు ఎందుకు వచ్చింది? చివరికి గోవర్ధన్, ఇందు ఎలా ఒక్కటయ్యారు అనేదే ఈసినిమా కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: