పుష్ప‌2 టీజర్- స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న టీజర్

pushpa 2 teaser create new records in youtube

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప‌-2 ది రూల్. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప ఫస్ట పార్ట్ సంచలన విజయం సాధించడమే. ఫస్ట్ పార్ట్ తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈసినిమాలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, డైరెక్ట‌ర్ సుకుమార్ మేకింగ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇటీవ‌ల అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈసినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే కదా. అయితే ఈ టీజ‌ర్ విడుద‌లైనప్ప‌టి నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ తో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా స‌న్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. అంతేకాదు టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుండి యూట్యూబ్‌లో కంటిన్యూగా 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో నెంబ‌ర్‌వ‌న్‌గా వుంటూ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. అంతేకాదు ఇప్ప‌టి వ‌ర‌కు 110 మిలియ‌న్ల వ్యూస్‌తో పాటు, 1.55మిలియ‌న్ల లైక్స్‌తో అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటూ విజ‌య‌ప‌థంలో కొన‌సాగుతుంది.

కాగా ఈసినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − nine =