తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసిన ప్రేమలు మూవీ

premalu movie now streaming on aha and hotstar

గిరీష్ దర్శకత్వంలో మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రేమలు. మలయాళంలో వచ్చిన ప్రేమలు సినిమా అక్కడ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. దాదాపు 135కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈసినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈసినిమా తెలుగు ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వారు సొందం చేసుకున్నారు. అంతేకాదు ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించారు కూడా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అలాగే మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈసినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

కాగా ఈసినిమాలో ఇంకా అల్తాఫ్ సలీం,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈసినిమాకు సంగీతం..విష్ణు విజయ్, సినిమాటోగ్రఫి.. అజ్మల్ సాంబు అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + sixteen =