మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆతర్వాత కూడా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ స్టార్ హీరో అయ్యాడు. ఇక రంగస్థలంతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఆసినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ స్థాయిలో రామ్ చరణ్ క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఇక్కడ మాత్రమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సైతం అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. రామ్ చరణ్ డాక్టరేట్ ను అందుకున్నాడు. రామ్ చరణ్‌కు చెన్నైలోని వేల్స్ యూనివర్సీటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్‌కు డాక్టరేట్‌ను ప్రధానం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Mega Power Star #RamCharan receives honorary doctorate, becoming Dr. Konidela @AlwaysRamCharan 🎓#DrKonidelaRamCharan#GameChanger #RC16 #RC17 #TeluguFilmNagar pic.twitter.com/l0ig3OwTyt
— Telugu FilmNagar (@telugufilmnagar) April 13, 2024
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. దీనితో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: