
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 103


రాజస్థాన్ లో "వాలిమై " షూటింగ్
జెట్ స్పీడ్ లో నితిన్
"ఆదిపురుష్ "మూవీ అప్ డేట్
'లవ్ స్టోరీ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
మాళవిక శర్మ మనసులో మాట
న్యూ ఇయర్ సమంత న్యూ హాబీ
గార్జియస్ వైఫ్ కు బర్త్ డే విషెస్
'క్రాక్' షూర్ షాట్ హ్యాట్రిక్ అవుతుంది
షాకింగ్ లుక్ లో నాగశౌర్య

శరవేగంగా "శ్యామ్ సింగ రాయ్ " మూవీ షూటింగ్
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' రిలీజ్ డేట్ చెప్పిన సామ్
"క్రాక్" హ్యాట్రిక్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా
కోలుకున్న వరుణ్ - కరోనా నెగిటివ్
"శాకుంతలం" మూవీ కి భారీ సెట్స్

1000+ స్క్రీన్స్ లో "క్రాక్ "
'మాస్టర్' - నాని కూడా ఒక ఆప్షన్
రష్మిక ' రేంజ్' రోవర్
'క్రాక్' అక్కడ ఒక రోజు ముందే విడుదల

7 భాషల్లో రామ్ 'రెడ్' రిలీజ్
నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా ఆయనకు మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేను శైలజతో పాటు ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి. సంక్రాంతి పండుగా సందర్భంగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాజస్థాన్ లో "వాలిమై " షూటింగ్
బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ తల అజిత్ కుమార్ , హూమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న "వాలిమై " మూవీ లో హీరో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో కార్తీకేయ నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
జెట్ స్పీడ్ లో నితిన్
సూపర్ హిట్ "భీష్మ "తరువాత యంగ్ హీరో నితిన్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ మార్చి నెల 6 వ తేదీ రిలీజ్ కానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "చెక్ "మూవీ ఒక సాంగ్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుందని సమాచారం. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ , ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు.
"ఆదిపురుష్ "మూవీ అప్ డేట్
టి -సిరీస్ , రిట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ తో "ఆదిపురుష్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడు గా నటిస్తున్నారు. సీత పాత్రకు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పేరు పరిశీలనలో ఉంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న "ఆదిపురుష్ "మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది.
'లవ్ స్టోరీ' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
2020 లో ఎలాంటి సినిమా అప్ డేట్స్ లేక కాస్త నిరాశపడిన అభిమానులకు 2021 లో మాత్రం వరుస అప్ డేట్స్ తో ఫుల్ జోష్ ను నింపుతున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఇప్పటికే చాలా సినిమాల అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసారి లవ్ స్టోరీ సినిమా అప్డేట్ వచ్చేసింది.
మాళవిక శర్మ మనసులో మాట
లా స్టూడెంట్ , మోడల్ మాళవిక శర్మ "నేల టికెట్ "మూవీ లో మెడికల్ స్టూడెంట్ పాత్రతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED" మూవీ లో మాళవిక ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించారు."RED" మూవీ" సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మాళవిక పాత్రికేయులతో సమావేశమయ్యారు.
న్యూ ఇయర్ సమంత న్యూ హాబీ
స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం , ఫిట్ నెస్ లకు అధిక ప్రాధాన్యత నిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , గార్డెనింగ్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లతో సమంత ఫొటో షూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. "కాతువాకుల రెండు కాదల్ "తమిళ మూవీ లో నటిస్తున్న సమంత, నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గార్జియస్ వైఫ్ కు బర్త్ డే విషెస్
టాలీవడ్ యంగ్ హీరో నితిన్ - షాలిని ల పెళ్లి గత ఏడాది జరిగిన సంగతి తెలిసిందే కదా. కరోనా పరిస్థితులు ఉన్నా కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని.. కొద్దిపాటి బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తాజాగా భార్యతో కలిసి తిరుపతి కూడా వెళ్లాడు నితిన్. అంతేకాదు కాలి నడకన ఏడు కొండలు ఎక్కినట్టు.. అదికూడా 2.20 గంటల్లోనే మెట్లు ఎక్కినట్టు నితిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
'క్రాక్' షూర్ షాట్ హ్యాట్రిక్ అవుతుంది
కరోనా వలన గత కొన్నినెలలుగా పరిస్థితులు పూర్తిగా మారిన సంగతి తెలిసిందే. కొన్ని పరిశ్రమలు ఒకటి రెండు నెలల్లో కోలుకున్నా.. సినీ ఇండస్ట్రీకి మాత్రం కోలుకోడానికి కాస్త ఎక్కువ టైమే పట్టింది. ఇప్పుడిప్పుడే మళ్లీ హడావుడి మొదలైంది. అది కూడా క్రాక్ సినిమాతో. లాక్ డౌన్ తర్వాత మొదట జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాదే. క్రాక్ చిత్రం జనవరి 14న విడుదల కానుండగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అయితే పెద్ద హడావుడిగా లేకుండా క్రాక్ ప్రీ రిలీజ్ వేడుకను జరిపారు. సుమ హోస్ట్‌గా వ్యవహరించగా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
షాకింగ్ లుక్ లో నాగశౌర్య
యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్యం " మూవీ జనవరి 4 వ తేదీ నుండి ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. హీరో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఆ పాత్రకై నాగశౌర్య 8 ప్యాక్ అబ్స్ ను సాధించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన నాగశౌర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

శరవేగంగా "శ్యామ్ సింగ రాయ్ " మూవీ షూటింగ్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా" మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా నేపథ్యంలో పీరియాడికల్ మూవీ "శ్యామ్ సింగరాయ్ " రూపొందుతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి , "ఉప్పెన "మూవీ ఫేమ్ కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. రాహుల్ రవీంద్రన్ , మురళీశర్మ , అభినవ్ గోమఠం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' రిలీజ్ డేట్ చెప్పిన సామ్
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది.
"క్రాక్" హ్యాట్రిక్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా
మొత్తానికి చిన్న చిన్నగా టాలీవడ్ లో పూర్వపు కళ వస్తుంది. షూటింగ్స్, ప్రమోషన్స్, ఆడియో లాంచ్ లు ఇలా ఎప్పుడూ సందడి సందడిగా ఉండేది. కరోనా వల్ల గత కొన్నినెలలుగా ఆ సందడిని కోల్పోయాం. ఇక ఇప్పుడు ఆ సందడి మొదలవుతుంది. ఇక ఈ సంక్రాంతికి పలు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో రవితేజ నటించిన క్రాక్ కూడా ఒకటి. రవితేజ నటించిన క్రాక్ చిత్రం జనవరి 14న విడుదల కానుండగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిన్న నిర్వహించారు.
గోపీచంద్ తో తర్వాత సినిమా - అఫీషియల్ అనౌన్స్ మెంట్
`భలే భలే మగాడివోయ్`, మహానుభావుడు, `ప్రతిరోజూ పండగే` ఇలా వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. కమర్షియల్ ఎలిమెంట్స్ లో అయినా.. హార్రర్ జోనర్ అయినా సరే తనదైన శైలిలో కామెడీని జోడించి నవ్వించగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ మారుతి. రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్‌కు `ప్రతీరోజు పండగే` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి మరో కొత్త సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటివరకూ ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. ఆ మధ్య మాస్ మహారాజా రవితేజతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు.
కోలుకున్న వరుణ్ - కరోనా నెగిటివ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నాడు. ఇక ఇప్పుడు వరుణ్ కోలుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా చేయించుకున్న పరీక్షలో తనకు కోవిడ్ `నెగిటివ్` వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ``నెగిటివ్`గా వచ్చిన రిపోర్ట్ నాకు ఇంత సంతోషాన్ని కలిగిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అవును.. నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చింద`ని వరుణ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
"శాకుంతలం" మూవీ కి భారీ సెట్స్
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతం ఆది పర్వం లోని శకుంతల -దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా “శాకుంతలం “మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం” లో స్టార్ హీరోయిన్ సమంత శకుంతల పాత్రకై ఎంపిక అయ్యారు. ప్రణయకావ్యం గా రూపొందుతున్న “శాకుంతలం “మూవీబ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసి మూవీ పై ఆసక్తి ని కలిగించింది. సమంత కథానాయికగా ఎంపిక అయిన మరో మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా , ప్రేక్షకులను ఆకట్టుకుంది. .

1000+ స్క్రీన్స్ లో "క్రాక్ "
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
'మాస్టర్' - నాని కూడా ఒక ఆప్షన్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న సినిమా మాస్టర్. కాలేజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి పండుగకు జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం భారీ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.
రష్మిక ' రేంజ్' రోవర్
టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను' సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.
'క్రాక్' అక్కడ ఒక రోజు ముందే విడుదల
మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మూడో చిత్రం 'క్రాక్'. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పక్కా హిట్ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియెన్స్ ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగానే జరుపుతున్నారు.