కోలుకున్న వరుణ్ – కరోనా నెగిటివ్

Varun Tej Tests Negative For Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej Tests Negative For Coronavirus,Varun Tej,Varun Tej tests negative for COVID-19: Thanks for the love and prayers,Varun Tej tests negative for COVID-19,COVID-19,Varun Tej tests negative for COVID-19,Varun Tej Konidela tests Negative for coronavirus

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నాడు. ఇక ఇప్పుడు వరుణ్ కోలుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా చేయించుకున్న పరీక్షలో తనకు కోవిడ్ `నెగిటివ్` వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. “నెగిటివ్`గా వచ్చిన రిపోర్ట్ నాకు ఇంత సంతోషాన్ని కలిగిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అవును.. నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చింద`ని వరుణ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వరుణ్ తేజ్‌తోపాటు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా కొన్ని రోజుల కిత్రం కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. చరణ్ చెప్పిన కొద్దిగంటలలోపే వరుణ్ తనకు కూడా కరోనా వచ్చిందని చెప్పాడు. అయితే ఇప్పుడు వరుణ్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం చెర్రీ ఆయన భార్య ఉపాసన కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మరి చరణ్ నెగిటివ్ వచ్చిందన్న వార్త ఎప్పుడు చెపుతాడో చూద్దాం.

కాగా ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − two =