ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 104
ఛాలెంజింగ్ రోల్ లో రెజీనా
'ఆచార్య' యూనిట్ కు వంద స్మార్ట్‌ఫోన్లు గిప్ట్
రష్మిక ను భయపెట్టే విషయాలు
'ఆచార్య' అద్భుతమైన టెంపుల్ సెట్
లక్కీ హీరోయిన్ కృతిశెట్టి

"ఫైటర్ "మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం
'ఫలక్ నుమా ప్యాలెస్' లో రాధే శ్యామ్
యువరాణి గా కేథరిన్
థియేటర్ లోకి రాబోతున్న అరణ్య - రిలీజ్ డేట్ ఫిక్స్
"పొన్నియిన్ సెల్వన్ "మూవీ అప్ డేట్
ఆడియెన్స్ కు రవితేజ రిక్వెస్ట్

100% ఆక్యుపెన్సీ కోసం టాలీవుడ్
థ్రిల్లర్ మూవీ "దృశ్యం "
పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తా - సంతోష్ శ్రీనివాస్

2020పై అకీరా ఫన్నీ మీమ్
అలిమేలు మంగ గా తాప్సీ
న్యూ బిగినింగ్స్ 2021 -పూజాహెగ్డే
లక్కీ గర్ల్ దివి వద్థ్య
సంక్రాంతికి నిధి సినిమాల సందడి
బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేట్ అయిన నిధి అగర్వాల్ బ్యాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ పొందారు. "సవ్యసాచి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల నిధి బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. నిధి కోలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టారు. నిధి హీరోయిన్ గా నటించిన రెండు తమిళ మూవీస్ ఒకే రోజున రిలీజ్ కానున్నాయి.
ఛాలెంజింగ్ రోల్ లో రెజీనా
9 సంవత్సరాల వయస్సు లో కిడ్స్ ఛానల్ కు యాంకర్ గా పనిచేసిన రెజీనా , 16 సంవత్సరాల వయస్సు లో "కందమాల్ ముదల్ "తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. "సూర్యకాంతి"మూవీ తో శాండల్ వుడ్ , "శివ మనసులో శృతి "మూవీ తో టాలీవుడ్ కు రెజీనా పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రెజీనా "ఏక్ లడకీ కో దేఖా ఇసా లగా "మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా ప్రస్తుతం 5 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
'ఆచార్య' యూనిట్ కు వంద స్మార్ట్‌ఫోన్లు గిప్ట్
సోనూసూద్ గురించి ఇప్పుడు తెలియని వారు ఎవరు వుంటారు. అడిగినవారికి.. అడగని వారికి సైతం సాయం చేస్తూ తన ఔదార్యాన్ని చూపిస్తున్నాడు. లాక్ డౌన్ లో ఎంతోమందికి సాయం చేసిన సోనూసూద్ లాక్ డౌన్ తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సోనూసూద్ సాయం పొందిన వారు చాలామంది వున్నారు. ఇప్పుడు మరోసారి తన ఉదార మనసునుచాటాడు .
రష్మిక ను భయపెట్టే విషయాలు
టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ , "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు రష్మిక కథానాయికగా పరిచయం అవుతున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
'ఆచార్య' అద్భుతమైన టెంపుల్ సెట్
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో భారీ టెంపుల్ టౌన్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. దాదాపు 20 ఎకరాల్లో ఈ సెట్ వేశారు.
లక్కీ హీరోయిన్ కృతిశెట్టి
భరతనాట్యం డ్యాన్సర్ , థియేటర్ ఆర్టిస్ట్ మంగుళూరు బ్యూటీ కృతిశెట్టి "సరిగమ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. కొన్ని తమిళ మూవీస్ లో అద్వైత పేరుతో నటించిన కృతిశెట్టి , బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన "ఉప్పెన " మూవీ లో కథానాయికగా నటించారు. భారీ అంచనాలు ఉన్న "ఉప్పెన " మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.

"ఫైటర్ "మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం
పూరి కనెక్ట్స్ ,ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ పాన్ ఇండియా మూవీ "ఫైటర్ " మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతుంది. "ఫైటర్ "మూవీ ముంబై షెడ్యూల్ తో 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మరో ముంబై షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఫారిన్ ఫైటర్స్ తో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాలనుకొన్న దర్శకుడు ప్లాన్ కరోనా కారణంగా సాధ్యపడలేదు.
'ఫలక్ నుమా ప్యాలెస్' లో రాధే శ్యామ్
‘బాహుబలి’, ‘సాహో’తో ప్యాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వం లో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్, 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఇక టీజర్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రీసెంట్ గా ఒక ఓ ప్రామిస్ చేసిన సంగతి కూడా విదితమే. త్వరలోనే ఈ సినిమా టీజర్ అప్ డేట్ ఇస్తానని చెప్పాడు.
అప్పుడు 'రైడ్' కి కలిసొచ్చింది - ఇప్పుడు 'అల్లుడు అదుర్స్' కి
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ సినిమా ట్రయిలర్ ను కూడా నిన్న రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సాయి శ్రీనివాస్ కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఈసారి కామెడీపై కూడా ద్రుష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. మంచి కామెడీ యాంగిల్ ను కూడా బయటపెట్టాడు.
యువరాణి గా కేథరిన్
మోడల్ ,సింగర్ , డ్యాన్సర్ కేథరిన్ ట్రెసా "శంకర్ ఐపిఎస్ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. కన్నడ , తమిళ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కేథరిన్ "చమ్మక్ చల్లో "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఇద్దరమ్మాయిలతో ", "పైసా ", "రుద్రమదేవి ", "సరైనోడు ", నేనే రాజు నేనే మంత్రి " వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. కేథరిన్ ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
థియేటర్ లోకి రాబోతున్న అరణ్య - రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు ఈ ఏడాది వరుసపెట్టి రెలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా కొన్ని సినిమాలు రిలీజ్ లను కూడా ఆపాల్సి వచ్చింది. ఇక ఎలాగోలా కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో థియేటర్స్ ఓపెన్ చేయడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అలా పెండింగ్ లో ఉన్న సినిమాల్లో రానా నటించిన అరణ్య సినిమా కూడా ఒకటి.
"పొన్నియిన్ సెల్వన్ "మూవీ అప్ డేట్
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్, త్రిష , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో కల్కి కృష్ణ మూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా చోళ రాజవంశం నేపథ్యంలో హిస్టారికల్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్" మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఆడియెన్స్ కు రవితేజ రిక్వెస్ట్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.. 6వ తేదీ (ఈ రోజు )“క్రాక్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

100% ఆక్యుపెన్సీ కోసం టాలీవుడ్
కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు పైన థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అయితే కరోనా నిబంధనలు అనుసరిస్తూ కేవలం 50శాతం ఆక్యూపెన్సీ ఇచ్చారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా తమిళనాడు ప్రభుత్వం 50 శాతం నుంచి 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో తెలుగు రాష్ట్రాలు కూడా 100 అక్యూపెన్సీ కోరుతూ ప్రభుత్వాలను కోరింది టాలీవుడ్ పరిశ్రమ .
థ్రిల్లర్ మూవీ "దృశ్యం "
సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెలుగు , తమిళ , మలయాళ సక్సెస్ ఫుల్ చిత్ర సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ చిత్రపరిశ్రమ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ "దృశ్యం " మూవీ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో నదియా , నరేష్ , పరుచూరి వెంకటేశ్వర రావు , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. శరత్ సంగీతం అందించారు.
పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తా - సంతోష్ శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. “అల్లుడు అదుర్స్ ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో మోనాల్ ప్రేక్షకులను అలరించనున్నారు.

2020పై అకీరా ఫన్నీ మీమ్
రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. పవన్, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది రేణు. ఇక తాజాగా అకీరా చేసిన మీమ్ ఒకటి పోస్ట్ చేసింది. వారు పెంచుకునే రెండు పిల్లులు ఉంటే పెద్దది చిన్న పిల్లిని రెండు చేతుల్లో పట్టుకొని ఉంది. దానికి పెద్ద దాని చేతుల్లో నలిగిపోయినట్టుగా 2020వ సంవత్సరంపై అకీరా ఫన్నీ మీమ్ క్రియేట్ చేసాడు. పైగా ఆ ఫోటోను కూడా అకీరానే తీసి ఆ మీమ్ ను తయారు చేసినట్టుగా రేణు దేశాయ్ తెలిపారు.
అలిమేలు మంగ గా తాప్సీ
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజ, గోపీచంద్ హీరోగా "అలిమేలుమంగ వెంకటరమణ "మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ లో కథానాయికగా కాజల్ అగర్వాల్ , కీర్తి సురేష్ , అనుష్క పేర్లు వినిపించాయి. బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ తాప్సీ ని దర్శకుడు తేజ అలిమేలుమంగ క్యారెక్టర్ కు ఎంపిక చేశారు. తాప్సీ ప్రస్తుతం పలు బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు.
న్యూ బిగినింగ్స్ 2021 -పూజాహెగ్డే
టాలీవుడ్ స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గ రాణిస్తున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ లో పూజాహెగ్డే పాల్గొంటున్నారు. అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే తెలుగు మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
లక్కీ గర్ల్ దివి వద్థ్య
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ K చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మలయాళ మూవీ "అయ్యప్పనుమ్ కోషియమ్ "తెలుగు రీమేక్ గా ఈ మల్టీస్టారర్ మూవీ రూపొందనుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈమూవీ లో బిగ్ బాస్ 4 ఫేమ్ దివి ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం.