2020 లో ఎలాంటి సినిమా అప్ డేట్స్ లేక కాస్త నిరాశపడిన అభిమానులకు 2021 లో మాత్రం వరుస అప్ డేట్స్ తో ఫుల్ జోష్ ను నింపుతున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఇప్పటికే చాలా సినిమాల అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసారి లవ్ స్టోరీ సినిమా అప్డేట్ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా తెలిపారు. జనవరి 10 వ తేదీన ఉదయం 10గంటల 8నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయడానికి టైంను ఫిక్స్ చేశారు.
Dream | Passion | Determination | Love
Our LoveStory is one such!
Teaser on Jan 10th at 10:08am.#LoveStoryTeaser@sekharkammula @Sai_Pallavi92 @SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic @NiharikaGajula pic.twitter.com/oboVZxkAql— chaitanya akkineni (@chay_akkineni) January 7, 2021
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఫిదాలో సాయి పల్లవితో మ్యాజిక్ క్రియేట్ చేసాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. చూద్దాం మరి నాగ చైతన్య-సాయి పల్లవిల ‘ లవ్ స్టోరీ’ ఎలా ఉంటుందో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: