కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 102

సినిమా వార్తలు

'రంగమార్తాండ' గురూజీ మొదలుపెట్టారు

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో 'రంగ మార్తాండ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో స్టార్ హీరోయిన్ త్రిష

సక్సెస్ ఫుల్ "మౌనం పేసియదే"(2002 ) మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన త్రిష , "నీమనసు నాకు తెలుసు "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో అలరించిన త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అలరిస్తున్న త్రిష కథానాయికగా రూపొందిన 4 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 2 తమిళ , ఒక మలయాళ మూవీ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. "పొన్నియిన్ సెల్వన్ "మూవీ షూటింగ్ లో పాల్గొనడానికై త్రిష నిన్న(8వ తేదీ)హైదరాబాద్ చేరుకున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

"A1 ఎక్స్ ప్రెస్ " ఫస్ట్ లుక్ రిలీజ్

వెంకటాద్రి టాకీస్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాఠి జంటగా హాకీ గేమ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ రూపొందింది. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి తెలుగు సినిమా "A1 ఎక్స్ ప్రెస్ " మూవీ లో తమ క్యారెక్టర్స్ కై సందీప్ , లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ పొందారు. మురళీశర్మ , రావు రమేష్ , పోసాని , ప్రియదర్శి , రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'శాకుంతలం' - శకుంతల లుక్ టెస్ట్ వర్కింగ్ సెషన్స్

గుణశేఖర్ పౌరాణిక కథాంశంతో 'శాకుంతలం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది శాకుంతలం. ఇన్ని ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారా అన్న ప్రశ్నకు ఇటీవలే శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు గుణశేఖర్. ఇక సినిమాలో సెట్స్ గురించి గుణశేఖర్ ఎంత క్రియేటివిటీ తో ఎంత అద్భుతంగా ప్లాన్ చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఒక్కడు సినిమాలోనే చార్మినార్ సెట్ ఒకటి చాలు చెప్పుకోడానికి. ఇక రుద్రమదేవి సినిమాలో మరో అద్భుతం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అన్ని వర్గాల వారికి 'మాస్టర్' పెద్ద ట్రీట్‌

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న సినిమా మాస్టర్. కాలేజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి పండుగకు జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం భారీ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Saves Life Of A Kid Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Mahesh Babu,Super Star Mahesh Babu Latest News,Super Star Mahesh Babu New Movie
సినిమా వార్తలు

మరో ప్రాణం - మహేష్ @1019

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించిన సంగతి తెలిసిందే కదా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయికి పైగా చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే వుంది.

TFN Adminవాట్సాప్
Actress Shriya Saran Completes 20 Years Of Her Film Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shriya Saran,Shriya Saran Latest News,Shriya Saran New Movie News,Heroine Shriya
సినిమా వార్తలు

20 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న శ్రియ

"ఇష్టం "(2001 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రియ సూపర్ హిట్ "సంతోషం " మూవీ తో హీరోయిన్ గా గుర్తింపు పొందారు. తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ శ్రియ తన 20 సంవత్సరాల కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. యువ హీరోల తోపాటు స్టార్ హీరోలకు జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం 2 తమిళ , రౌద్రం రణం రుధిరం ", "గమనం " మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Teja Sajja To Team Up With Wink Beauty Priya Prakash Varrier For His New Movie,Teja Sajja And Priya Prakash Varrier Team Up For A Youthful Film ISHQ,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tolly
సినిమా వార్తలు

తేజ-వింక్ బ్యూటీ 'ఇష్క్'

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి అప్పుడే అందరిచేత ప్రశంసలు దక్కించుకున్నాడు తేజ. ఇక ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేసేస్తున్నాడు. ఓ బేబీ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన తేజ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న 'జాంబీ రెడ్డి' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమా మొదలవుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"మిషన్ మజ్ను" సెట్స్ లో రష్మిక

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్న రష్మిక "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. స్టార్ హీరోయిన్ రష్మిక పలు భాషల మూవీస్ నుండి ఆఫర్స్ అందుకుంటున్నారు. "మిషన్ మజ్ను " మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ్రహ్మీ-కోవై సరళ కామెడీ సీన్స్

తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇక బ్రహ్మీ పక్కన కోవై సరళ ఉంటే కామెడీకి కొదువే ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో సినిమాలలో వీరి ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతం. సినిమాలో వీరు ఇద్దరు భార్య భర్తల పాత్ర పోషిస్తే ఇంక కామిడీకి కొదవ లేదు. వీరు ఇద్దరూ భార్య భర్తల క్యారక్టర్స్ లో చేసి ఎంతగానో మెప్పించారు. బ్రహ్మానందం డైలాగ్ కి కోవై సరళ రివర్స్ పంచ్ కి సరిపోతుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

అనుపమ పరమేశ్వరన్ షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్

సక్సెస్ ఫుల్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అనుపమ "నటసార్వభౌమ "మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 2 మలయాళ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్న అనుపమ , నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18 పేజెస్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"లూసిఫర్ "రీమేక్ లో ప్రియమణి?

"ఎవరే అతగాడు" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. "పరుత్తి వీరన్ "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియమణి ప్రస్తుతం 4తెలుగు , 3 కన్నడ , ఒక హిందీ , ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న ప్రియమణిని , "లూసిఫర్ "మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు సంప్రదించినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ధనుష్ 'డీ43' మొదలు

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం ‘కర్ణన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. దానితో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘జగమే తంత్రం’ సినిమా కూడా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'శ్రీ విష్ణు' కొత్త సినిమా ప్రారంభం

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. తన స్థాయికి తగ్గ రేంజ్ లో మంచి కథలను చేసుకుంటూ వెళ్తున్నాడు శ్రీవిష్ణు. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకటే కథ వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు వరుస సినిమాలకు ఓకే చెప్తూ మంచి జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"శ్యామ్ సింగ రాయ్ " మూవీ కి భారీ సెట్ ?

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన "టక్ జగదీష్ " మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో పీరియాడికల్ మూవీ “శ్యామ్ సింగరాయ్ ” లో నటిస్తున్నారు . సాయి పల్లవి , “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. రాహుల్ రవీంద్రన్ , మురళీశర్మ , అభినవ్ గోమఠం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'క్రాక్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ యోగా సర్ ప్రైజ్

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ పలు భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. క్రిష్ మూవీ షూటింగ్ ను రకుల్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "చెక్ "మూవీ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. తమిళ భాషలో "ఇండియన్ 2 ", "అయిలాన్ " మూవీస్ లో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా రూపొందిన బాలీవుడ్ మూవీ "దే దే ప్యార్ దే " మూవీ ఘనవిజయం సాధించడంతో రకుల్ బాలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులు , ఫాలోవర్స్ కు థ్యాంక్స్ - అల్లు అర్జున్

సక్సెస్ ఫుల్ "విజేత "(1985) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ "గంగోత్రి " మూవీ తో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ "ఆర్య " మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని స్టైలిష్ హీరోగా పేరు పొందారు. 2020 సంవత్సరం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'కె.జి.యఫ్ 2' టీజర్ - దుమ్మురేపుతున్న రాఖీ భాయ్

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకు రాయుళ్లు మాత్రం ఏదో ఒక విధంగా తమ ప్రతాపం చూపిస్తూనే వున్నారు. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో తెలుసు.. అలాంటిది బాహుబలి సినిమాకే లీకులు తప్పలేదు. ఇక పవన్ నటించిన అత్తారింటి దారేది సినిమా అయితే సగానికి పైగా నెట్ లో దర్శనమిచ్చింది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న వకీల్ సాబ్ సినిమా ఫైట్ కు సంబంధించి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఇక ఇప్పుడు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ 2 కు కూడా లీకు రాయుళ్లు పెద్ద షాకే ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

జనవరి 14 వచ్చేస్తున్న 'వకీల్ సాబ్'

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్