రష్మిక ‘ రేంజ్’ రోవర్

Rashmika Mandanna Posts A Picture Of Her Brand New Car On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Upcoming Movie News,Rashmika Mandanna Next Project News,Rashmika Mandanna Latest Film Details,Rashmika Mandanna New Pictures,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna New Images

టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ర‌ష్మిక త‌న‌కెంతో ఇష్ట‌మైన రేంజ్ రోవ‌ర్ ఎస్ యూవీని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సంతోషంగా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. నేను సాధార‌ణంగా చాలా వ‌ర‌కు నా కోసం ఇలాంటి వి కొనుగోలు చేస్తుంటా. కానీ ఈ సారి మీతో ఈ విష‌యాన్ని షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే నా జ‌ర్నీలో మీరు కూడా భాగమయ్యారు. నేను మిమ్మ‌ల్ని ఎంత‌గా ఇష్ట‌ప‌డుతున్నానో మీకు తెలియాలి. ఇది మీ కోస‌మే..గ్రేట్ ఫుల్ అంటూ రేంజ్ రోవ‌ర్ ముందు దిగిన ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేసింది.

కాగా ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలను తన ఖాతాలో వేసుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక.. ప్రస్తుతం అల్లుఅర్జున్ సినిమా పుష్పలో నటిస్తుంది. ఈ సినిమాలోకూడా మరో విభిన్నమైన పాత్రలో నటిస్తుంది. ఇక ఇదిలా ఉండగా రెమో ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా ‘సుల్తాన్’. ఫ్యామిలీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌ర్‌గా తెర‌కెక్కుతున్న సుల్తాన్ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + nine =