‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ రిలీజ్ డేట్ చెప్పిన సామ్

Samantha Akkineni Reveals The Release Date Of The Family Man 2 Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Samantha Akkineni Latest News,Samantha Akkineni Upcoming Movie News,The Family Man 2,The Family Man 2 Web Series,The Family Man 2 Web Series Release Date Confirmed,The Family Man 2 Web Series Release Date Locked

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా, దానిని స‌మంత షేర్ చేస్తూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది. సిరీస్‌లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న మనోజ్ భాజ్‌పాయ్ సీరియ‌స్ లుక్‌లో కనిపిస్తుండ‌గా, ఆయ‌న వెనుక స‌మంత ఫొటో క‌నిపిస్తుంది. “శ్రీకాంత్ మిషన్ వెనుక ఒక విలన్ ఆ విలన్ శ్రీకాంత్ వెనుక ఉంది” అని క్యాప్ష‌న్ ద్వారా తెలియ‌జేశారు. దీనిబట్టి ఈ సిరీస్ లో సమంతా చాలా స్ట్రాంగ్ రోల్ లోనే కనిపిస్తున్నట్టుగా అర్ధం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 12న హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ వెబ్ సిరీస్ తో పాటు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది సమంత. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. తెలుగులో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =