‘క్రాక్’ అక్కడ ఒక రోజు ముందే విడుద‌ల

Krack Movie To Release In USA One Day Prior To India

మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడో చిత్రం ‘క్రాక్‌’. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పక్కా హిట్ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎంట‌ర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియెన్స్ ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగానే జరుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇక యూఎస్ మాత్రం ఒక రోజు ముందే రిలీజ్ అవుతుంది. యూఎస్ లోని ప‌లు లొకేష‌న్ల‌లో జ‌న‌వ‌రి 8న క్రాక్ ను విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్.

కాగా రవితేజ సరసన ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి చూడబోతే ఈ సినిమాతో రవితేజ గోపీచంద్ హ్యాట్రిక్ కొట్టేలాగే కనిపిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 9 =