7 భాషల్లో రామ్ 'రెడ్' రిలీజ్
Red Movie To Release Worldwide Across Seven Languages

నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా ఆయనకు మూడవ సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నేను శైలజతో పాటు ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చాయి. సంక్రాంతి పండుగా సందర్భంగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను మొత్తం 7 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. కన్నడం, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, మరాఠి, తమిళంతో పాటు హిందీలోకి కూడా రిలీజ్ చేయనున్నారు దర్శకనిర్మాతలు. కన్నడ వెర్షన్ ఈ నెల 14నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్లను ఈ నెలాఖరున రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. తమిళ వెర్షన్‌ని మాత్రం డైరెక్ట్‌గా ఓటిటిలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
వీడియోస్
00:01:21RED Official Teaser
00:13:14Ram Pothineni B2B Punch Dialogues
00:06:06Shivam Movie Special
00:03:19


