‘క్రాక్’ షూర్ షాట్ హ్యాట్రిక్ అవుతుంది

Krack Movie Will Be A Sure Hattrick Says Gopichand Malineni,Krack: Director Gopichand Malineni Reveals Interesting Details At The Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Gopichand Malineni,Director Gopichand Malineni Latest News,Director Gopichand Malineni About Krack Movie,Director Gopichand Malineni Comments On Krack Telugu Movie,Gopichand Malineni Sensational Comments On Krack Movie

క‌రోనా వ‌ల‌న గత కొన్నినెలలుగా ప‌రిస్థితులు పూర్తిగా మారిన సంగ‌తి తెలిసిందే. కొన్ని పరిశ్రమలు ఒకటి రెండు నెలల్లో కోలుకున్నా.. సినీ ఇండస్ట్రీకి మాత్రం కోలుకోడానికి కాస్త ఎక్కువ టైమే పట్టింది. ఇప్పుడిప్పుడే మళ్లీ హడావుడి మొదలైంది. అది కూడా క్రాక్ సినిమాతో. లాక్ డౌన్ తర్వాత మొదట జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాదే. క్రాక్ చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుండ‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించారు. అయితే పెద్ద హడావుడిగా లేకుండా క్రాక్ ప్రీ రిలీజ్ వేడుక‌ను జరిపారు. సుమ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా ఈ కార్యక్రమంలో ప‌లువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. జనవరి 9న మా క్రాక్ రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి పండక్కి ముందే మాకు పెద్ద పండక రానుంది. నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన రవితేజ గారికి నా కృతజ్ఞతలు. ఆయన నాకు ఒక బ్రదర్ లా తోడుంటాడు. డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత మా ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రాక్ చిత్రం షూర్ షాట్ హ్యాట్రిక్ అవుతుంది. ప్రేక్షకులు, అభిమానులు రవితేజ నుండి ఏం కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. మాది సూపర్ హిట్ కాంబినేషన్. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబోతుంది. నేను పుట్టి పెరిగిన ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తీశాం.. నిజ జీవిత వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రామ్-లక్ష్మణ్, థమన్, జికె విష్ణు, సాయి మాధవ్ బుర్రా, అందరం కలిసి ఒక టీమ్ వర్క్ లా చేశాం. మధుగారు అమ్మిరాజు ఏది కావాలన్నా కాంప్రమైజ్ కాకుండా ప్రొవైడ్ చేసి అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు అని అన్నారు.

కాగా సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి చూడబోతే ఈ సినిమాతో రవితేజ గోపీచంద్ హ్యాట్రిక్ కొట్టేలాగే కనిపిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.