“ఆదిపురుష్ “మూవీ అప్ డేట్

Adipurush Movie Team To Give An Interesting Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Movie Updates,Adipurush Telugu Movie Update,Prabhas Adipurush Movie Team,Adipurush Movie Team Give An Interesting Movie Update,Interesting Update From Adipurush Movie

టి -సిరీస్ , రిట్రో ఫైల్స్ బ్యానర్స్ పై ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ తో “ఆదిపురుష్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడు గా నటిస్తున్నారు. సీత పాత్రకు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పేరు పరిశీలనలో ఉంది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ “మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆదిపురుష్ “మూవీకై ముంబై లోని ఒక ప్రముఖ స్టూడియో లో భారీ బడ్జెట్ తో ఒక సెట్ రూపొందించబడింది. జనవరి 19 వ తేదీ నుండి ఈసెట్ లో “ఆదిపురుష్ “మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రభాస్ , సైఫ్ అలీ ఖాన్ లతో పాటు ఇతర తారాగణం తో కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు ఓం రౌత్ ప్లాన్ చేశారు. తెలుగు , హిందీ భాషలతో పాటు “ఆదిపురుష్ “మూవీ డబ్బింగ్ వెర్షన్స్ కన్నడ , తమిళ , మలయాళ , కొన్ని ఫారిన్ లాంగ్వేజెస్ లలో రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. “ఆదిపురుష్ “మూవీతో పాటు నాగ్ అశ్విన్ మూవీ , ప్రశాంత్ నీల్ “సలార్ ” మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 13 =