“శాకుంతలం” మూవీ కి భారీ సెట్స్

Shakuntalam Movie Team To Erect Massive Sets For Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shakuntalam,Shakuntalam Movie,Shakuntalam Telugu Movie,Shakuntalam Movie Updates,Shakuntalam Telugu Movie Latest News,Shakuntalam Movie Shooting Updates,Shakuntalam Telugu Movie Shooting Latest News,Massive Sets For Shakuntalam Movie Shooting

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతం ఆది పర్వం లోని శకుంతల -దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా “శాకుంతలం “మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం” లో స్టార్ హీరోయిన్ సమంత శకుంతల పాత్రకై ఎంపిక అయ్యారు. ప్రణయకావ్యం గా రూపొందుతున్న “శాకుంతలం “మూవీబ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసి మూవీ పై ఆసక్తి ని కలిగించింది. సమంత కథానాయికగా ఎంపిక అయిన మరో మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా , ప్రేక్షకులను ఆకట్టుకుంది. .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ సెట్స్ లో వర్క్ చేసే దర్శకులలో గుణశేఖర్ ఆద్యుడు. “ఒక్కడు ” మూవీలో చార్మినార్ , “అర్జున్ ” మూవీ లో మధుర మీనాక్షి టెంపుల్, “రుద్రమ దేవి” మూవీ లో కాకతీయుల కోట వంటి భారీ సెట్స్ లో గుణశేఖర్ చిత్రీకరణ జరిపిన విషయం తెలిసిందే. కమర్షియల్ మూవీస్ ను భారీ సెట్స్ లో తెరకెక్కించే దర్శకుడు గుణశేఖర్ మైథలాజికల్ మూవీ “శాకుంతలం” కు భారీ సెట్ ను రూపొందించే ఏర్పాట్ల లో ఉన్నారు. ఈ సెట్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. ఈ సెట్ తో పాటు మరికొన్ని సెట్స్ కూడా రూపొందనున్నాయి. “శాకుంతలం” మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − three =