‘మాస్టర్’ – నాని కూడా ఒక ఆప్షన్

Natural Star Nani Used To Be The Initial Choice For The Role Of Vijay Sethupathi In Master Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani,Master,Master Movie,Master Telugu Movie,Vijay Sethupathi,Role Of Vijay Sethupathi In Master Movie,Nani Used To Be The Initial Choice For The Role Of Vijay Sethupathi In Master Telugu Moive

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న సినిమా మాస్టర్. కాలేజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి పండుగకు జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం భారీ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్ట్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ పాత్రకు తమిళ్ స్టార్ హీరో మాధవన్ ఇంకా న్యాచురల్ స్టార్ నాని అని కూడా అనుకున్నారట. ఈ విషయాన్ని ఆమె డైరెక్టర్.. మాస్టర్ సినిమాకు రైటర్ గా పనిచేసిన రత్న కుమార్ తెలిపాడు. విజయ్ సేతుపతి మొదటి ఛాయిస్ ఆయన ఒప్పుకోకపోతే మాధవన్, నాని లలో ఒకర్ని పెడతాం అనే ఆలోచల చేశారట. అయితే సినిమా నిర్మాత సతీష్ విజయ్ సేతుపతికి కథను వినిపించగా ఆయనకు నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడని.. చెప్పుకొచ్చాడు. విజయ్ తో పాటు సమానంగా విజయ్ సేతుపతికి స్క్రీన్ స్పేస్ ఉంటుందని తెలిపారు.

కాగా తమిళనాడు ప్రభుత్వం విజయ్‌ మాస్టర్ సినిమాకు వంద శాతం పర్మిషన్స్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. దీంతో తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ సంతోషపడ్డారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి చూద్దాం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.

కాగా ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + three =