రాజస్థాన్ లో “వాలిమై ” షూటింగ్

Ajith Valimai Movie Team Heads To Rajasthan For Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Valimai,Valimai Movie,Valimai Telugu Movie,Valimai Movie Shooting Updates,Valimai Telugu Movie Shooting Latest News,Ajith Valimai Movie Team,Ajith

బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై హెచ్ వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ తల అజిత్ కుమార్ , హూమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “వాలిమై “తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న “వాలిమై ” మూవీ లో హీరో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో కార్తీకేయ నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ , చెన్నై లలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న “వాలిమై ” మూవీ లోని కొన్ని యాక్షన్ సీన్స్ ను విదేశాల్లో చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. కరోనా కారణంగా విదేశాలలో షూటింగ్ సాధ్యపడదు కనుక “వాలిమై ” మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ ను దర్శకుడు రాజస్థాన్ లో ప్లాన్ చేశారు. ఈ నెలలోనే తాజా షూటింగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో ప్రారంభం కానుంది. దర్శకుడు వినోత్ , హీరో అజిత్ కాంబినేషన్ లో రూపొందిన “నెర్కొండ పార్వై “మూవీ ఘనవిజయం సాధించింది. వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అజిత్ హీరో గా రూపొందుతున్న “వాలిమై ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =